వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను 420 కాదు, 108 అంబులెన్స్: శ్రీరాములు, రెడ్డి బ్రదర్స్ ఆటలు, సిద్దూకు కౌంటర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: లోక్ సభ, శాసన సభ ఉప ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. తాను 420 కాదని, ప్రజలు తనను 108 అంబులెన్స్ అని పిలుస్తారని బళ్లారి శ్రీరాములు కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కౌంటర్ ఇచ్చారు.

నాకు జైలు శిక్ష, అందుకే దేవుడు నీ కొడుకుకు చావు శిక్ష వేశాడు బళ్లారి రెడ్డి, పాపాలు!నాకు జైలు శిక్ష, అందుకే దేవుడు నీ కొడుకుకు చావు శిక్ష వేశాడు బళ్లారి రెడ్డి, పాపాలు!

ముఖ్యంగా బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం సందర్బంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. బళ్లారి ప్రజలను డబ్బుతో కొనలేరని, ఇక్కడి ప్రజలు నిజాయితీతో బతుకుతారని శ్రీరాములు గుర్తు చేశారు.

మిస్టర్ 420

మిస్టర్ 420

లోక్ సభ ఉప ఎన్నికల సందర్బంగా బళ్లారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మాజీ సీఎం సిద్దరామయ్య బళ్లారి శ్రీరాములును ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన మిస్టర్ ‘చార్సౌ బీస్'(మిస్టర్ 420) అని విమర్శించారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, శ్రీరాములు వలన బళ్లారి ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని సిద్దరామయ్య విమర్శించారు.

నేను 108 అంబులెన్స్

నేను 108 అంబులెన్స్

బళ్లారి ప్రజలు తనను 108 అంబులెన్స్ అంటూ పిలిచి ఆశీర్వదిస్తారని, ఆ విషయం మాజీ సీఎం సిద్దరామయ్య గుర్తు పెట్టుకోవాలని బళ్లారి శ్రీరాములు కౌంటర్ ఇచ్చారు. 420లు ఎవరో ప్రజలకు బాగాతెలుసని శ్రీరాములు కాంగ్రెస్ నాయకుల మీద మండిపడ్డారు. బీఎస్. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీరాములు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. 2008 నవంబర్ 1వ తేదీన కర్ణాటకలో 108 అంబులెన్స్ సేవలు ప్రారంభం అయ్యాయి.

రెడ్డి బ్రదర్స్ ఆటలు

రెడ్డి బ్రదర్స్ ఆటలు

బళ్లారి రెడ్డి బ్రదర్స్ ఆడుకోవడానికి ఓ తోలుబొమ్మ లాంటి వ్యక్తి కావాలని, శ్రీరాములు ఓ తోలుబొమ్మ అని, బళ్లారి రెడ్డి సోదరులు లూటీ చేసిన సొమ్ములో కొంచెం బళ్లారి శ్రీరాములుకు వేస్తారని, ఈ దెబ్బకు బళ్లారి రెడ్డి సోదరులు ఆడినట్లు శ్రీరాములు ఆటలు ఆడుతున్నాడని మాజీ సీఎం సిద్దరామయ్య ఎద్దేవ చేశారు. బళ్లారి బహిరంగ సభలో శ్రీరాములు ఒక 420 అంటూ మాజీ సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో అందరూ షాక్ కు గురైనారు.

 లోకల్ నాన్ లోకల్

లోకల్ నాన్ లోకల్


బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప స్థానికుడు కాదని శ్రీరాములు, బీజేపీ అభ్యర్థి శాంతా ప్రచారం చేస్తున్నారని సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేశారు. మీరు ఇద్దరూ బళ్లారిలోనే పుట్టి పెరిగారు, మీ వల్ల స్థానికులకు ఏం న్యాయం జరిగిందని సిద్దరామయ్య ప్రశ్నించారు.

శ్రీరాములుకు కన్నడ వస్తుందా ?

శ్రీరాములుకు కన్నడ వస్తుందా ?

బళ్లారి ప్రజలకు సేవ చేసేముందు మొదట శ్రీరాములు, ఆయన సోదరి శాంతా కన్నడ బాష మాట్లాడటం నేర్చుకోవాలని సిద్దరామయ్య ఎద్దేవ చేశారు. సిద్దరామయ్య వ్యాఖ్యలపై శ్రీరాములు మండిపడ్డారు. కర్ణాటకలోని ఒక్కొక్క భాగంలోని ప్రజలు కన్నడ బాషను ఒక్కోవిధంగా మాట్లాడుతారని గుర్తు చేశారు. కన్నడ బాషను కించపరచడానికి సిద్దరామయ్య ఈ విధంగా మాట్లాడుతున్నారని శ్రీరాములు ఆరోపించారు.

 కుల రాజకీయాలు

కుల రాజకీయాలు


కర్ణాటకలోని అనేక జాతులను విభజించి రాజకీయాలు చెయ్యాలని సిద్దరామయ్య ప్రయత్నించారని శ్రీరాములు ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో సిద్దరామయ్య ప్లాన్ రివర్స్ అయ్యిందని శ్రీరాములు ఆరోపించారు. బళ్లారి ఉప ఎన్నికలు శ్రీరాములు VSడీకే. శివకుమార్ కాదని, బీజేపీ VSకాంగ్రెస్ అని శ్రీరాములు గుర్తు చేశారు.

అధికార దాహం

అధికార దాహం

అధికార దాహం, డబ్బు వ్యామోహంతో రామనగర బీజేపీ అభ్యర్థి చంద్రశేఖర్ కు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు చివరి నిమిషంలో గాలం వేశారని శ్రీరాములు ఆరోపించారు. వాల్మీకి జయంతి సందర్బంగా సీఎం హెచ్.డి. కుమారస్వామి కార్యక్రమానికి హాజరుకాకుండా వాల్మీకీలను అవమానించారని శ్రీరాములు మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వంలో తండ్రి కుమారుడు (హెచ్.డి. దేవేగౌడ, హెచ్.డి. కుమారస్వామి) ఎన్ని కష్టాలు పెట్టినా అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమీ చెయ్యలేక చూసిచూడనట్లు పోతున్నారని శ్రీరాములు ఎద్దేవ చేశారు.

English summary
I am not 420, people in this part calling me 108 ambulance Bellary B. Sriramulu. Monakalmuru BJP MLA Sriramulu sharp reaction to former CM Siddaramaiah in Bellary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X