వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"టెర్రరిస్టు" ఆరోపణలపై స్పందించిన ప్రజ్ఞా ఠాకూర్ ! వారికి సమాదానం చెప్పడానికే వచ్చా !

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : రాజకీయ అరంగేట్రంపై ఘాటు విమర్శలు చేసిన వారికి దిమ్మదిరిగే జవాబిచ్చారు సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపేందుకు తానేమీ ఉగ్రవాదిని కాదని అన్నారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రజ్ఞా ఠాకూర్ తనపై విమర్శలు చేసిన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలతో పాటు కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ దుశ్చర్యలకు తాను బలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

<strong>హార్దిక్ పటేల్ చెంప ఛెళ్లుమనిపించిన దుండగుడు (వీడియో)</strong>హార్దిక్ పటేల్ చెంప ఛెళ్లుమనిపించిన దుండగుడు (వీడియో)

 నేనేం ఉగ్రవాదిని కాదు

నేనేం ఉగ్రవాదిని కాదు

ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించేందుకు నేనేమీ ఉగ్రవాదిని కాదన్నారు సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దారుణాలకు తానొక ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. మాలేగావ్ బాంబు దాడుల్లో తన పాత్ర లేనందునే కోర్టులు సైతం క్లీన్ చిట్ ఇచ్చాయని అన్నారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘించారో నిబంధనల్ని తుంగలో తొక్కి ప్రజలపై ఏ విధంగా ఉక్కుపాదం మోపారో దేశానికి తెలియజేయాల్సిన రోజు ఆసన్నమైందని ప్రజ్ఞా ఠాకూర్ స్పష్టం చేశారు.

హేమంత్ కర్కరే‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

హేమంత్ కర్కరే‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

మాలేగావ్ పేలుళ్ల కేసులో తనను అన్యాయంగా ఇరికించారని సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ ఆరోపించారు. తనను జైల్లో పెట్టి శారీరక, మానసిక హింసకు గురి చేశారని అన్నారు. ఈ సందర్భంగా ముంబై దాడుల్లో మరణించిన యాంటీ టెర్రర్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరేపై ప్రజ్ఞావివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్కరే తనను ఒక కేసులో ఇరికించడానికి ప్రయత్నించారని, అప్పడు నీ వంశం నాశమైపోతుందని శపించానని సాధ్వీ గుర్తు చేసుకున్నారు. తాను శపించిన మూడు నెలలకే ఆయన ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

సాధ్వీ ప్రజ్ఞాపై మహబూబా, ఒమర్ విమర్శలు

సాధ్వీ ప్రజ్ఞాపై మహబూబా, ఒమర్ విమర్శలు

సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ బీజేపీలో చేరడంపై జమ్మూ కాశ్మీర్ నేతలు మహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఘాటు విమర్శలు చేశారు. ఉగ్రదాడికి సూత్రధారిగా వ్యవహరించిన వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఇదే పని తాము చేసి ఉంటే బీజేపీ పెద్ద రాద్దాంతం చేసేదని జమ్మూ కాశ్మీర్ సీఎం, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ బీజేపీని ప్రశ్నించారు. ముఫ్తీ ట్వీట్‌పై స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా గతంలో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పుడు వారు ఎలాంటివారో తెలియలేదా అని చురకలంటించారు. ఈ విమర్శలను తిప్పికొడుతూ తాజా ఇంటర్వ్యూలో సాధ్వీ ప్రజ్ఞా తానేం టెర్రరిస్టును కాదని బదులిచ్చారు.

English summary
Sadvi Pragya Thakur who joined bjp clarified that she is not a terrorist. and she was the pure and living evidence of the Congress’ s misdeeds. she quoted that I have got a clean chit in all the cases. The NIA which was set up by UPA government has given a clean chit to me. They put me in jail illegally and tortured me physically, mentally and in every way. They misused law and violated the Constitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X