వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్త,మామల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన నటి ఊర్మిళ ఎందుకు..?

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యలపై ప్రముఖ నటి, ఇటివల కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిన ఊర్మీళ మటోద్కర్ తీవ్రంగా మండిపడ్డారు. కశ్మీర్‌లో నివసిస్తున్న వారితో కనీసం ఫోన్లో కూడ మాట్లాడలేక పోతున్నామని ఆమే విమర్శించారు. ప్రభుత్వం కమ్యూనికేషన్ వ్యవస్థను రద్దు చేసిన ఈనేపథ్యంలోనే తన భర్త అయిన మోషిన్ అఖ్తర్ ఆయన తల్లిదండ్రులతో మాట్లాడక 22 రోజులు అవుతుందని ఆమే తెలిపారు. ఇలాంటీ నిర్భంధం కశ్మీర్‌లో కొనసాగుతోందని ఆమే ఆగ్రహం వ్యక్తం చేశారు.

నటి ఊర్మిళను రంగంలోకి దింపిన కాంగ్రెస్

నటి ఊర్మిళను రంగంలోకి దింపిన కాంగ్రెస్

కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్న పరిస్థితి తెలిసిందే, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ ప్రభుత్వం పూర్తిగా కమ్యూనికేషన్ వ్యవస్థను రద్దు చేయడంతోపాటు పూర్తి నిర్భంధం కొనసాగిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా పలు చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వ చర్యలపై పలు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ తాజాగా ప్రముఖ నటీ ఊర్మీళను రంగంలోకి దింపింది. ఊర్మీళ అత్త మామాలు కశ్మీర్‌లో నివసిస్తున్న నేపథ్యంలోనే ఆమే మీడీయా ప్రతినిధులతో మాట్లాడారు.

సెక్రటేరియట్ ఉద్యోగులు జీన్స్, టీషర్ట్స్ వేసుకుని రావద్దు...!సెక్రటేరియట్ ఉద్యోగులు జీన్స్, టీషర్ట్స్ వేసుకుని రావద్దు...!

అత్తమామాలతో మాట్లడక 22 రోజులు అవుతోంది.

అత్తమామాలతో మాట్లడక 22 రోజులు అవుతోంది.

ఈనేపథ్యంలోనే తన భర్త తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కూడ అవకాశం లేదని, ఇలా 22 రోజులుగా వారితో మాట్లాడలేక పోతున్నారని ఆమే ప్రభుత్వ చర్యలపై ఫైర్ అయ్యారు. తన అత్తమామాలకు డయాబెటీస్‌తోపాటు బీపీ ఉన్నాయని వారికి కనీసం మందులు ఉన్నాయా లేవా అనే విషయం కూడ తమకు తెలియని స్థితిలో ఉన్నామని ,తెలిపారు. ఇక ఆర్టీకల్ 370 తోలగించడం సమస్య కాదు, దాన్ని అమానవీయ పద్దతిలో చేశారని విమర్శించారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన ఊర్మిళ

2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన ఊర్మిళ

కాగా ఊర్మిళ 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ముంబాయి నార్త్ లోక్‌సభ స్థానం నుండి పోటి చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి అయిన గోపాల్ శెట్టి చేతిలో సుమారు నాలుగున్నర లక్షల ఓట్లతో ఓడిపోయారు.ఇక కశ్మీర్ నుండి వచ్చి ముంబాయిలో స్థిరపడి ప్రముఖ మోడల్ వ్యాపారం చేస్తున్న మోసిన్ అక్తర్‌తో ఊర్మిళకు 2016లో వివాహం అయింది. కాగా ఆమే అత్తమామాలు ప్రస్తుతం కశ్మీర్‌లో నివసిస్తున్నారు.

English summary
Actor Urmila Matondkar, who joined the Indian National Congress in March this year, has rebuked the central government for the security clampdown imposed in Jammu and Kashmir since August 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X