• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హిందూ వ్యతిరేకిని కాను, మోడీకి మాత్రమే: ప్రకాశ్‌‌రాజ్, ‘పద్మావతి’పై విశాల్ హ్యాపీ

|

హైదరాబాద్‌: విలక్షణ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతారో వారిపై మాత్రమే దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అంతేగాక, తాను హిందూ వ్యతిరేకిని కాదు.. మోడీ వ్యతిరేకినంటూ ప్రకాశ్‌రాజ్‌ చెప్పుకొచ్చారు.

బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో గురువారం 'ఇండియా టూడే సౌత్‌ కన్‌క్లేవ్‌-2018లో స్టాండ్‌ ఔట్‌, స్పీక్‌ అప్‌, మేక్‌ యువర్‌సెల్ఫ్‌ కౌంట్‌' అనే అంశంపై జరిగిన చర్చా గోష్ఠిలో ప్రకాశ్ రాజ్ తోపాటు ఫిల్మ్‌ మేకర్‌ శశిధరన్‌, కంచ ఐలయ్య, హీరో విశాల్‌ పాల్గొన్నారు.

వారు హిందువులే కారు

వారు హిందువులే కారు

ఈ సందర్భంగా భావ వ్యక్తీకరణ, పద్మావత్‌ సినిమా వివాదం, హిందూ మతం గురించి వారు చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షు డు అమిత్‌ షాలు హిందువులే కాదని, ఎవరు హిందువో అసలు బీజేపీ గర్తించ లేకపోతోందని ప్రకాశ్ రాజ్ ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.

నిషేధం సరికాదు

నిషేధం సరికాదు

పద్మావత్‌ మూవీని కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు నిషేధించడం సరికాదని ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. స్వేచ్ఛగా మాట్లాడే వారిపై దాడులు చేయడం సబబు కాదని, జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించలేదని ప్రకాశ్‌రాజ్‌ ప్రశ్నించారు.

దాడి చేస్తోంది

దాడి చేస్తోంది

అనంతరం ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతూ.. భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. తాను రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పుస్తకాన్ని ప్రభుత్వం నిషేధించే ప్రయత్నం చేసినా సుప్రీం కోర్టు అంగీకరించలేదని తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌ చర్చ సుప్రీం కోర్టులో వచ్చినప్పుడు ప్రభుత్వం మద్దతు తెలిపిందని, బ్రాహ్మణులు కాని వారి సమస్యలు కోర్టుకు వచ్చినప్పుడు మద్దతు తెలపలేదని అన్నారు.

సుప్రీం తీర్పుతో సంతోషం

సుప్రీం తీర్పుతో సంతోషం

హీరో విశాల్‌ మాట్లాడుతూ.. ఒక సినిమాపై ఆరోపణలు చేసి, విడుదలను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. పద్మావతి సినిమాపై నిషేధం ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు భన్సాలీ తర్వాత ఈ నిర్ణయంతో సంతోషించిన వ్యక్తిని తానేనని చెప్పారు. సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ ఇవ్వాలి కానీ, సినిమాను సెన్సార్ చేయడమేంటని ప్రశ్నించారు. కాగా, ఫిల్మ్‌ మేకర్‌ శశిధరన్‌ మాట్లాడుతూ.. దుర్గా మూవీనే ఎందుకు తీశారు ? ఇతర పర్సనాలీటీస్‌పై ఎందుకు సినిమా చేయలేదు? అనడం సబబు కాదన్నారు. తాను తీసిన ఎస్‌ దుర్గ అనే మూవీ మతం గురించి కాదని ఆయన స్పష్టం చేశారు. శశిధరన్‌కు ప్రకాశ్‌రాజ్‌ మద్దుతగా నిలిచారు. ఇండియా టుడే కన్‌క్లేవ్‌ మొదటి సెషన్‌లో రిథం డివైన్‌లో నృత్యకారులు యామినిరెడ్డి, భావన రెడ్డి, పెర్క్యూషనిస్ట్‌ ప్రవీణ్‌ స్పర్శ్‌ పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రా‌జ్‌దీప్ సర్దేశాయి ముఖాముఖి నిర్వహించారు.

English summary
Actor Prakash Raj on Thursday said he was not anti-Hindu as alleged by critics but only anti-Modi. “They say I am anti-Hindu but I say I am anti-Modi, anti-Amit Shah and anti-Hegde,” the actor said at the India Today South conclave in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X