వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను దేవతను కాదు, కానీ: రాధే మా, కొత్త చిక్కులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: సుఖ్వీందర్ కౌర్ అలియాస్ రాధే మా పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. తన పేరు కేవలం ముంబైలో మాత్రమే కాదని, ప్రపంచం మొత్తం తెలుసునని రాధే మా వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

తాను దేవతను కాదని, కేవలం రాధే మా అని చెప్పింది. కాంధీవాలీ పోలీసులు రాధే మా స్టేట్మెంటును రికార్డు చేశారు. ముంబై హైకోర్టు రెండు వారాలపాటు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేయలేదు.

రాధే మా మత విశ్వాసాలను దెబ్బతీసిందని, దుర్గామాతను అవమానపరిచిందని లూథియానాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆరోపించారు. రాధే మాకు వ్యతిరేకంగా లూథియానా కోర్టులో కేసు దాఖలు చేశారు.

‘I am not god, I am Radhe Maa’

దుర్గామాత అవతారంగా చెప్పుకునే ఆమె మినీ స్కర్టులు వేసుకొని తమ విశ్వాసాలకు భంగం కలిగించిందన్నారు. దీంతో ఆమెకు కొత్త చిక్కు వచ్చి పడింది. రాధే మా పైన కేసు పెట్టేందుకు ముంబై పోలీసులు సిద్ధమవుతున్నారు.

వివాదాలలో ఇరుక్కోవడంతో రాధే మా భక్తులకు దర్శనం ఇవ్వడం లేదు. తనకు అతీంద్రీయ శక్తులు ఉన్నాయంటూ ఎవరినీ మోసం చేయలేదని ఆమె పోలీసులకు చెప్పారు.

English summary
Sukhwinder Kaur alias Radhe Maa, a self-declared spiritual leader and accused in a dowry harassment case, reminded the Kandivli police throughout her five-hour interrogation on Friday that she is a household name not just in Mumbai, but in many countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X