వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చెయ్యలేదు, అసెంబ్లీలో: రెబల్ ఎమ్మెల్యేకి చురకలు అంటించిన స్పీకర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఫ్యాక్స్ లో రాజీనామా లేఖ పంపిస్తే తీసుకోవడానికి తాను ఏమీ తపాల శాఖలో (పోస్ట్ ఆఫీస్)లో ఉద్యోగం చెయ్యలేదని కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళికి కర్ణాటక విధాన సభ స్పీకర్ రమేష్ కుమార్ చురకలు అంటించారు. ఎవరో ఏం పని చేస్తున్నారో తెలుసుకుంటే మీకే మంచిందని స్పీకర్ రమేష్ కుమార్ రెబల్ ఎమ్మెల్యేలకు సూచించారు.

బెంగళూరులోని విధాన సౌధలో విలేకరులతో మాట్లాడిన స్పీకర్ రమేష్ కుమార్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ లో స్పీకర్ కు పంపించానని మీడియాకు చెప్పడం విడ్డూరంగా ఉందని మండిప్డారు. ఇక్కడ అందరూ రాజ్యాంగానికి అనుగుణంగా పని చేస్తున్నామని, నేనుకూడా అంతే అని, ఆ విషయం వాళ్లు గుర్తు పెట్టుకోవాలని స్పీకర్ రమేష్ అన్నారు.

I am not in postal department. MLAs to send resignation letter through fax said speaker of the Karnataka assembly K.R.Ramesh Kumar.

ఎమ్మెల్యేల రాజీనామాలు, వాటిని ఆమోదించే విషయం విధాన సభ వ్యవహారం అని స్పీకర్ రమేష్ కుమార్ చెప్పారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తన నివాసంలో ఆయన రాజీనామా పత్రాన్ని అందించారని స్పీకర్ రమేష్ కుమార్ చెప్పారు.

అయితే ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రాజీనామా లేఖ ప్రస్తుతం పరిశీలనలోనే ఉందని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఉమేష్ జాదవ్ (కాంగ్రెస్)లో విషయంలో ఎలా వ్యవహరించానో ఇప్పుడు అలానే ఆనంద్ సింగ్ వ్యవహారంలో వ్యవహరిస్తానని స్పీకర్ రమేష్ కుమార్ చెప్పారు.

తనకు ఫ్యాక్స్ లో రాజీనామా పంపించానని ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి చెబితే సరిపోతాందా, ఆ లేఖ తనకు అందాలికదా అని స్పీకర్ రమేష్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారం విధాన సభ స్పీకర్ పరిశీలనలో ఉంది.

English summary
I am not in postal department. MLA's to send resignation letter through fax said speaker of the Karnataka assembly K.R.Ramesh Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X