వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను బతకనివ్వండి, సంక్షోభానికి కారణమని భావిస్తే వదులుకోండి

తనను బతకనివ్వాలని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అమర్ సింగ్ చెప్పాడు. పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తానే కారణమనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశాడు. ిది నిజమని ములాయం నమ్మితే తనను వదులకోవాలని కోరాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్ :సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తాను కారణం కాదని ఆ పార్టీ నుండి సస్పెన్షన్ వేటుకు గురైన , పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ప్రకటించారు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలోని నెలకొన్న వివాదాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ఎస్ పి జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించి పార్టీ చీఫ్ గా ములాయం స్థానంలో అఖిలేష్ ను ఎన్నుకొన్నారు.అంతేకాదు పార్టీ నుండి అమర్ సింగ్ సస్పెండ్ చేశారు.

amar singh

పార్టీ నుండి సస్పెన్ష్ వేటుకు గురైన అమర్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభంపై స్పందించారు. ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ ల మధ్య విబేధాల వెనుక తాను లేనని చెప్పారు. లండన్ లో ఉన్న ఆయన ఈ విషయమై స్పందించారు.

తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నవారికి తాను చెప్పదలుచుకొంది ఒక్కటే, దయచేసి తనను బతకనివ్వండి , తన కుటుంబం కోసం తాను బతకాలని కోరుకొంటున్నానని ఆయన తేల్చి చెప్పారు. సమాజ్ వాదీ పార్టీలో తన వల్లే సంక్షోభం నెలకొందని ములాయం సింగ్ భావిస్తే తనను వదులుకోవాలని ఆయన ములాయం సింగ్ యాదవ్ ను కోరారు.

English summary
iam not the reason for yadav family feud said amar singh. i want to request the people putting allegations against me that please letme live.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X