వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీఏ-ఎన్డీయే.. మధ్యలో నేనో ఫుట్‌బాల్.. ఆడేసుకుంటున్నారు..: మాల్యా

యూపీఏకు-ఎన్డీయేకు మధ్య తానో ఫుట్‌బాల్ లా మారిపోయానని, ఎలాంటి మధ్యవర్తి లేకుండానే ఇరు వర్గాలు తనతో ఫుట్‌బాల్ ఆడుతున్నాయని ట్విట్టర్‌లో మాల్యా పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయాల రుణ ఎగవేతకు పాల్పడి.. యూకెకు చెక్కేసిన మాల్యా.. అక్కడినుంచే ట్విట్టర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఓవైపు మాల్యాను ఇండియా రప్పించడానికి విచారణ సంస్థలు తంటాలు పడుతుంటే.. ఆయన మాత్రం.. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

యూపీఏకు-ఎన్డీయేకు మధ్య తానో ఫుట్‌బాల్ లా మారిపోయానని, ఎలాంటి రిఫరీ లేకుండానే ఇరు వర్గాలు తనతో ఫుట్‌బాల్ ఆడుతున్నాయని ట్విట్టర్‌లో మాల్యా పేర్కొన్నారు. సీబీఐ కావాలనే తన ఈమెయిల్స్ ను వక్రీకరించి మీడియాకు విడుదల చేసిందని ఆయన ఆరోపించారు.

యూపీఏ పాలన మీద కక్ష సాధింపు ధోరణితోనే తన మీద ఇలా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని మాల్యా విమర్శించారు. కాగా, బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసిన విజయ్ మాల్యాకు ప్రధాని మన్మోహన్ సింగ్ సహాయపడ్డారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

నష్టాల్లో ఉందని తెలిసి కూడా కింగ్ ఫిషర్ కు మన్మోహన్ రుణాలు ఇప్పించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు సంబంధించిన పత్రాలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియా ముందుకు తీసుకొచ్చారు.

దీనిపై స్పందిస్తూ మాల్యా 'ఫుట్ బాల్' కామెంట్స్ చేశారు. సీబీఐ ఆరోపణలతో తాను షాక్‌కు గురయ్యానని, బిజినెస్, ఎకనమిక్స్ గురించి పోలీసులకు ఏమి తెలుసని మాల్యా ప్రశ్నించారు.

English summary
Liquor baron and founder of now defunct Kingfisher Airlines Vijay Mallya expressed shock over media reports - reportedly based on CBI's claim
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X