• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టుడే అప్‌డేట్స్: 'నేను ముస్లింనే, ఉగ్రవాదిని కాను'

By Nageswara Rao
|

దేశ రాజధానిలోని జెఎన్‌యూలో ఆదివారం రాత్రి నుంచి మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ గేటు వెలుపల రాత్రి నుంచి పోలీసులు దేశద్రోహం కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చూస్తుంటే, అరెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు యూనివర్సిటీ లోపల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద మంతనాలను కొనసాగిస్తున్నారు.

దీంతో జేఎన్‌యూలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్ గురు ఉరితీతకు నిరసనగా జెఎన్‌యూలో ర్యాలీ నిర్వహించిన కొంతమంది విద్యార్ధులు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీని వర్సిటీలోని ఏబీవీపీ విద్యార్థి సంఘం అడ్డుకుంది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ వీడియో జెఎన్‌యూ క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులను తీసుకొచ్చింది. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో అఫ్జల్ గురుకు మద్దతుగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కన్హయ్య, ఉమర్ నాయకత్వం వహించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

'నేను ముస్లింనే, ఉగ్రవాదిని కాను'

'నేను ముస్లింనే, ఉగ్రవాదిని కాను'

అంతేకాదు వీడియోను పరిశీలించిన ఢిల్లీ పోలీసులు కన్నయ్య కుమార్ సహా ఆరుగురిపై రాజద్రోహం కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 12న కన్నయ్య అరెస్ట్ అయిన వెనువెంటనే మిగిలిన ఐదుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. తాజాగా అదృశ్యమైన విద్యార్థులు ఆదివారం రాత్రి యూనివర్సిటీలో ప్రత్యక్షమయ్యారు.

'నేను ముస్లింనే, ఉగ్రవాదిని కాను'

'నేను ముస్లింనే, ఉగ్రవాదిని కాను'

సమాచారం అందుకున్న పోలీసులు యూనివర్సిటీ వద్దకు చేరుకుని వీసీకి సమాచారం అందించారు. అనుమతిస్తే ఆ ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేస్తామన్న వారి ప్రతిపాదనకు ఇప్పటిదాకా వీసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మరోవైపు క్యాంపస్ నుంచి అదృశ్యమైన ఉమర్ ఖలీద్ మీడియాతో మాట్లాడారు.

'నేను ముస్లింనే, ఉగ్రవాదిని కాను'

'నేను ముస్లింనే, ఉగ్రవాదిని కాను'

గడిచిన ఏడేళ్లుగా తాను జేఎన్‌యూ క్యాంపస్‌లో ఉన్నానని, అయితే ఈ ఏడేళ్లలో ఎప్పుడూ తనను తాను ముస్లింగా భావించలేదు గానీ, ఈ పది రోజుల్లో మాత్రం అలాగే అనుకునేలా చేశారని ఆరోపిస్తున్నాడు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నాడు. నా పేరు ఉమర్ ఖలీదే గానీ, ఉగ్రవాదిని మాత్రం కాదని స్పష్టం చేశాడు.

'నేను ముస్లింనే, ఉగ్రవాదిని కాను'

'నేను ముస్లింనే, ఉగ్రవాదిని కాను'

కేవలం మీడియా మాత్రమే తనపై ఉగ్రవాదిగా ముద్ర వేసిందని ఆరోపించాడు. మీడియా తన గురించి చాలా విషయాలు ప్రచారం చేసిందని, దీనివల్ల తన కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డారని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఉమర్ ఖలీద్ క్యాంపస్‌ నుంచి కనిపించకుండా పోయిన తర్వాత అతడు జైషే-ఇ-మహ్మద్ సానుభూతిపరుడన్న ప్రచారం మీడియాలో జరిగింది.

 'నేను ముస్లింనే, ఉగ్రవాదిని కాను'

'నేను ముస్లింనే, ఉగ్రవాదిని కాను'

తీవ్రవాదులతో అతడికి సంబంధాలున్నాయని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 9వ తేదీ కార్యక్రమానికి ముందు వారం వ్యవధిలో ఉమర్ గల్ఫ్‌ దేశాలకు లేదా కశ్మీర్ ప్రాంతానికి దాదాపు 800 ఫోన్ కాల్స్ చేసినట్టు అతడి ఫోన్ కాల్ డేటాలో వెల్లడైంది. అయితే ఈ వార్తలను ఉమర్ ఖండించాడు.

English summary
The JNU campus came alive on Sunday night when five students accused of raising anti-national slogans, returned to the university. The spotlight was on Umar Khalid, one of the two names that had came up prominently in the controversy. The other one being JNU students’ union president Kanhaiya Kumar, who is in Tihar now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more