వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లపై తొలిసారిగా పెదవి విప్పిన నరేంద్ర మోడీ: సోనియాగాంధీ నిప్పులు చెరిగిన నిమిషాల్లోనే..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిని అట్టుడికిస్తోన్న అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెదవి విప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరిస్తోన్న ఆందోళనకారులపై రెండురోజులుగా దాడులు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిపై నరేంద్ర మోడీ స్పందించడం ఇదే తొలిసారి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియాగాంధీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ముగిసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నరేంద్ర మోడీ ఈ అల్లర్లపై స్పందించారు.. ట్విట్టర్ ద్వారా.

శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి సహకరించాలని ఆయన ఢిల్లీవాసులకు విజ్ఙప్తి చేశారు. హింసాత్మక పరిస్థితులకు ప్రజాస్వామ్యంలో తావు లేదని అన్నారు. ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై జాతీయ భద్రతా సలహాదారు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించామని వెల్లడిచారు. ఈశాన్య ఢిల్లీ సహా వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలు దురదృష్టకరమని చెప్పారు.

I appeal to my sisters and brothers of Delhi to maintain peace, says Narendra Modi

Recommended Video

Good Morning India : 3 Minutes 10 Headlines | IPL Play Off Matches, Namaste Trump | Oneindia Telugu

ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా పట్టుసడలని ఐకమత్యాన్ని ప్రదర్శించడం, శాంతియుత వాతావరణానికి భంగం కలిగించకపోవడం భారతీముల నైజమని, దాన్ని నిలబెట్టుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని మోడీ చెప్పారు. ఢిల్లీలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడం తక్షణ అవసరమని, దీనికోసం పోలీసు యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మోడీ భరోసా ఇచ్చారు.

English summary
Prime Minister Narendra Modi has made an appeal to the protesters in Delhi to remain calm and maintain peace and brotherhood at all times. “Peace and harmony are central to our ethos. I appeal to my sisters and brothers of Delhi to maintain peace and brotherhood at all times. It is important that there is calm and normalcy is restored at the earliest,” PM Modi said on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X