వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేలెత్తి చూపకుండా, శిరస్సు వంచి నమస్కారం: మోడీ, ఎందరు ఒక్కటైనా నరేంద్రుడే!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: బీజేపీని గెలిపించిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Recommended Video

గుజరాత్ BJP ఎఫెక్ట్ : 2018, 2019 ఎన్నికలపై ప్రభావం, జగన్ కి కలిసొచ్చే అంశమే !

ఊహించని దెబ్బ: మోడీ దూకుడుకు 'గుజరాత్' కళ్లెం, ఆ వైపు మోడీ చూపు!ఊహించని దెబ్బ: మోడీ దూకుడుకు 'గుజరాత్' కళ్లెం, ఆ వైపు మోడీ చూపు!

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు. రెండు రాష్ట్రాల్లో గెలుపుపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీపై గుజరాత్, హిమాచల్ ప్రజలు చూపిన ప్రేమ, విశ్వాసానికి ధన్యవాదాలు అన్నారు. తన శిరస్సు వంచి వారికి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు.

బీజేపీ 'భారీ' విజయానికి అడ్డు ఇవే, చివరి నిమిషంలో.. గెలుపుకు కారణాలుబీజేపీ 'భారీ' విజయానికి అడ్డు ఇవే, చివరి నిమిషంలో.. గెలుపుకు కారణాలు

వేలెత్తి చూపకుండా అభివృద్ధి

వేలెత్తి చూపకుండా అభివృద్ధి

ఆయా రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో వేలెత్తి చూపడానికి వీలులేకుండా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని చెప్పారు. సుపరిపాలన, అభివృద్ధికి, ప్రజలు పట్టం కట్టారన్నారు. కష్టపడి పని చేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు అన్నారు.

గుజరాత్‌లో బీజేపీని ఢీకొట్టేందుకు

గుజరాత్‌లో బీజేపీని ఢీకొట్టేందుకు

కాగా, గుజరాత్‌లో ముగ్గురు యువనేతలు ప్రధాని నరేంద్ర మోడీ ముందు బలాదూర్ అయ్యారు. వారు ఓటింగ్ శాతం తగ్గంచగలిగారేమో కానీ, బీజేపీ గెలుపును మాత్రం అడ్డుకోలేకపోయారు. వారికి కాంగ్రెస్ తోడు కావడం గమనార్హం. రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ గుజరాత్‌లో విజయ దుందుభి మోగిస్తోంది. దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌కు ముగ్గురు యువనేతలు కూడా జతకలిశారు.

మోడీ హవా చెక్కు చెదరలేదు

మోడీ హవా చెక్కు చెదరలేదు

గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే మోడీ ప్రభావం, హవా చెక్కు చెదరలేదని అర్థమవుతోందని అంటున్నారు. సీఎంగా మోడీ ఉన్నప్పుడు గుజరాత్‌లో పారిశ్రామిక ప్రగతి కనిపించింది. అంతర్జాతీయ సంస్థలు గుజరాత్‌కు వచ్చాయి. శాంతిభద్రతలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మోడీ ఢిల్లీకి వెళ్లినా హవా తగ్గలేదు.

బీజేపీ గెలుపు సామాన్యమైనదేం కాదు

బీజేపీ గెలుపు సామాన్యమైనదేం కాదు

యువ నాయకుల మద్దతు, కాంగ్రెస్ జోరు, ఇరవై రెండేళ్లుగా పాలిస్తున్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకతను కాదని బీజేపీ గెలవడం సాధారణ విషయం కాదు. 2014లో లోకసభ ఎన్నికల్లో బీజేపీ 26 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు సీట్లు, ఓట్లు తగ్గినప్పటికీ మోడీ కారణంగా బీజేపీ గెలుపొందింది.

English summary
“I bow to the people of Gujarat and Himachal Pradesh for their affection and trust in BJP. I assure them that we will leave no stone unturned in furthering the development journey of these states and serve the people tirelessly,” says PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X