వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే బస్తర్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

టికారా లొహంగ గ్రామానికి చెందిన చందూ మౌర్య గత ఆదివారం ఒకే మండపంలో ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు.

ఈ పెళ్లి తంతు, వివిధ కార్యక్రమాలు నాలుగు రోజులపాటు జరిగాయి. చందూది మురియా తెగ.

''నేను ఈ ఇద్దరు అమ్మాయిలనూ ప్రేమించా. ఎవరికీ ద్రోహం చేయలేను. మనసులో కొంత అనుమానం ఉండేది. అయితే, ఈ ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. నేను కూడా ఒప్పుకున్నా’’ అని చందూ చెప్పారు.

చందూ భార్యల పేర్లు సుందరి కశ్యప్, హసీనా బఘేల్. ఈ పెళ్లి విషయమై వారిద్దరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

''నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఆయనతోనే ఉండాలనుకున్నా. ఆమె కూడా అదే కోరుకుంది. నాకే సమస్యా లేదు. పెళ్లి విషయం వచ్చేటప్పటికి, ఇద్దరం చందూనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అని సుందరి చెప్పారు.

చందూ మౌర్య తొమ్మిదో తరగతి వరకూ చదువుకుని, ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు.

చందూ కుటుంబానికి మొత్తంగా రెండెకరాల భూమి ఉంది. దీన్ని సాగు చేయడంతోపాటు అటవీ ఉత్పత్తులు సేకరిస్తూ వారు ఆదాయం సంపాదించుకుంటున్నారు.

మూడేళ్ల క్రితం పని మీద తోకాపాల్‌లోని ఎరండ్వాల్ గ్రామానికి వెళ్లానని, అక్కడే సుందరిని కలిశానని చందూ చెప్పారు.

సుందరి పదో తరగతి వరకూ చదువుకున్నారు.

మొదటిసారి చూసినప్పుడే, ఆమెకు తాను ప్రేమిస్తున్న విషయం చెప్పానని చందూ అన్నారు. ఆ తర్వాత ఇద్దరం ఫోన్‌లో మాట్లాడుకుంటూ, ప్రేమించుకున్నామని వివరించారు.

ఆ తర్వాత హసీనాతో...

ఆ తర్వాత రెండేళ్లకు ఓ పెళ్లి చూసేందుకు తమ గ్రామానికి వచ్చిన హసీనాను చందూ కలిశారు.

హసీనాది కరంజీ అనే గ్రామం. ఆమె తొమ్మిదో తరగతి వరకూ చదువుకున్నారు.

''హసీనా ఓ పెళ్లికి వచ్చింది. అక్కడే కలిశా. తను మాట్లాడుకుందాం అంది. సరే అన్నా. స్నేహితులమవుతాం అనుకున్నా. కానీ, విషయం ఇంకా ముందుకు వెళ్లింది’’ అని చందూ చెప్పారు.

''ఓ రోజు హసీనా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. సుందరి గురించి ఆమెకు చెప్పా. 'నీతో ఉండటానికి ఎవరు ముందు వస్తే, వారితో ఉండు’ అని హసీనా అంది. ఈ విషయం సుందరి ముందు దాచాలనుకోలేదు. ఆమెకు చెప్పాను. ఆ తర్వాత ముగ్గురం ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉన్నాం’’ అని వివరించారు.

సహజీవనం

కొన్ని రోజుల తర్వాత హసీనా తమ ఊరు విడిచిపెట్టి, చందూతో కలిసి ఉండేందుకు వచ్చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో చాలా తెగల్లో కొన్ని చిన్న సంప్రదాయ కార్యక్రమాలు చేసుకుని, పెళ్లి చేసుకోకుండానే యువతీయువకులు కలిసి ఉంటుంటారు.

అయితే, చందూ దగ్గరికి హసీనా వచ్చేసిన విషయం తెలుసుకుని సుందరి కూడా చందూ దగ్గరికి వచ్చేశారు. ముగ్గురూ కలిసి ఉండటం మొదలుపెట్టారు.

కానీ, సుందరిని ఆమె కుటుంబ సభ్యులు వచ్చి, మళ్లీ తమ ఇంటికి తీసుకువెళ్లారు.

''మేం ముగ్గురం కలిసి దాదాపు ఒక సంవత్సరం ఉన్నాం. మా తెగ వాళ్లు పెళ్లి చేసుకోమని అన్నారు’’ అని చందూ చెప్పారు.

చందూని పెళ్లి చేసుకుని ఆయనతోపాటు కలిసి ఉండేందుకు సుందరి, హసీనా ఇద్దరూ సిద్ధమయ్యారు.

దీంతో ముగ్గురి పేర్లతో పెళ్లి కార్డులు కొట్టించి, ఊరిలో వేడుకకు చందూ కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లూ చేశారు.

ఈ పెళ్లికి హసీనా బంధువులు వచ్చారు గానీ, సుందరి బంధువులు రాలేదు.

''ఈ పెళ్లితో నేను సంతోషంగా ఉన్నా. హసీనా, నేను ఏ విషయంలోనూ తగువులాడుకోం’’ అని సుందరి చెప్పారు.

సుందరి, హసీనా కలిసి మార్కెట్‌కు వెళ్తుంటారు. తమకు ఇష్టమైన దుస్తులు కొనుక్కుంటుంటారు.

భార్యలకు ఏదైనా కానుకగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఇద్దరికీ ఒకే రకమైనవి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని చందూ అన్నారు.

రాబోయే రోజుల్లో తమ మధ్య ఏ సమస్యా రాదని ఈ ముగ్గురూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి

చట్టం ఏం చెబుతోంది?

''ఆ ముగ్గురూ మురియా తెగకు చెందనివారే. ఈ తెగలో బహుభార్యత్వం తప్పు కాదు. మా సంఘానికి ఈ పెళ్లి విషయంలో అభ్యంతరాలు లేవు’’ అని సర్వ్ ఆదివాసీ సమాజ్ నాయకుడు ప్రకాశ్ ఠాకుర్ అన్నారు.

ఇక హిందూ వివాహ చట్టంలో బహుభార్యాత్వాన్ని నేరంగా పరిగణించే నియమాలు గిరిజన తెగలకు వర్తించవని... వారి వారి ఆచారాలు, విశ్వాసాలను పాటించుకునేలా సెక్షన్ 2(2) ద్వారా ఈ మినహాయింపు ఇచ్చారని హైకోర్టు న్యాయవాది ప్రియాంక శుక్లా చెప్పారు.

ఇదివరకు ఇదే విషయం స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు తీర్పును కూడా ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Man who married two women at same time says he has couldn't betray anyone
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X