వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై విచారణకు డిమాండ్, బిజెపి ఎలా గెలిచింది: హర్ధిక్ పటేల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష నేతలందరికీ లేఖలు రాస్తాను. అలాగే బ్యాలెట్‌ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తానని పటీదార్ల ఉద్యమ నాయకుడు హర్ధిక్ పటేల్ చెప్పారు.

బిజెపి ఈవీఎంల ట్యాంపరింగ్, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి: హర్ధిక్ సంచలనంబిజెపి ఈవీఎంల ట్యాంపరింగ్, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి: హర్ధిక్ సంచలనం

గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి విజయం సాధించిందని హర్ధిక్ పటేల్ ఆరోపించారు. బిజెపి గుజరాత్ రాష్ట్రంలో ఓటమి పాలు కావాల్సి ఉండేదని కానీ, ఆ పార్టీ మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి విజయం సాధించిందని ఆయన ఆరోపించారు.

ఎబిపి ఎగ్జిట్ పోల్స్: సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో బిజెపిదే హవాఎబిపి ఎగ్జిట్ పోల్స్: సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో బిజెపిదే హవా

అయితే కాంగ్రెస్ పార్టీ గుజరాత్ రాష్ట్రంలో బలం పుంజుకొందని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన కొన్ని స్థానాలను ఈవీఎంల ల్యాంపరింగ్ ద్వారా బిజెపి గెలుచుకొందని ఆయన ఆరోపణలు గుప్పించారు.

నాకు పెళ్ళి కాలేదు, నేనేం నపుంసకుడిని కాను: హర్ధిక్ పటేల్ సంచలనంనాకు పెళ్ళి కాలేదు, నేనేం నపుంసకుడిని కాను: హర్ధిక్ పటేల్ సంచలనం

ఈవీఎంల ట్యాంపరింగ్‌పై దర్యాప్తు చేయించాలి

ఈవీఎంల ట్యాంపరింగ్‌పై దర్యాప్తు చేయించాలి

ఈవీఎంల ట్యాంపరింగ్‌పై దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష నేతలందరికీ లేఖలు రాస్తాను. అలాగే బ్యాలెట్‌ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తానని హర్ధిక్ పటేల్ చెప్పారు.ఈవీఎంల ట్యాంపరింగ్ చేయకపోతే బిజెపి విజయం సాధించేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మరో వైపు బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలను నిర్వహించాలని హర్దిక్ పటేల్ డిమాండ్ చేశారు.

 కాంగ్రెస్ ఓట్ల శాతం

కాంగ్రెస్ ఓట్ల శాతం

కాంగ్రెస్‌ పార్టీకి గతంలో 33శాతం ఓట్ల శాతం ఉండేదని అది ఇప్పుడు 43శాతానికి పెరిగిందన్నారు. బిజెపి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడకపోతే మరో 12 నుంచి 13 సీట్లు కూడా కాంగ్రెస్‌ పార్టీకి వచ్చేవని హర్ధిక్ పటేల్ అభిప్రాయపడ్డారు. అయితే బిజెపి మోసం కారణంగానే ఈ సీట్లు రాలేదని హర్దిక్ ఆరోపించారు.

అందరూ వ్యతిరేకించిన బిజెపి ఎలా గెలిచింది

అందరూ వ్యతిరేకించిన బిజెపి ఎలా గెలిచింది

వాస్తవానికి బీజేపీకి 82 సీట్లు మాత్రమే రావాలి. వారిని పటేళ్లు, ఓబీసీలు, దళితులు, వ్యాపారులు వ్యతిరేకించారు. అలాంటప్పుడు ఇంకెవరు వారిని నమ్మి ఓటు వేస్తారని హర్ధిక్ పటేల్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే బిజెపికి ఈ విజయం దక్కకపోయేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎటీఎంల హ్యకింగ్ ఈవీఎంలు ఓ లెక్కా

ఎటీఎంల హ్యకింగ్ ఈవీఎంలు ఓ లెక్కా

ఏటీఎంలనే హ్యాకింగ్‌ చేస్తున్నారు, ఈవీఎంలను హ్యక్ చేయడం సాధ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్‌ను నిర్ణయించేది ఈవీఎంలేనని చెప్పారు. అయితే గతంలో మాదిరిగానే బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని హర్దిక్ పటేల్ అభిప్రాయపడ్డారు.సూరత్‌, రాజ్‌కోట్‌, అహ్మదాబాద్‌లలో కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేశారు' అని హార్ధిక్‌ అభిప్రాయపడ్డారు.

English summary
As it became clear that the BJP has won Gujarat again, Hardik Patel alleged that EVMs or Electronic Voting Machines were tampered with. He then sequestered himself at his apartment block in Silaj and messaged journalists that he would meet no one on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X