వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్స్‌పైరి ప్రధానమంత్రితో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు : మమతా బెనర్జీ ఫోన్ పే చర్చ...

|
Google Oneindia TeluguNews

ఫోని తుఫాన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పీఎం నరేంద్రమోడీకి మధ్య మరింత అగాధాన్ని సృష్టించింది. తుఫాన్ ప్రభావంపై చర్చ ఇద్దరి మధ్య రాజకీయ తుఫానుకు కారణమైంది. తుఫాన్ విషయంలో ప్రధాని మోడి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.

తుఫాన్ రేపిన రాజకీయం

తుఫాన్ రేపిన రాజకీయం

ఫొని తుఫాన్ ప్రభావం పై చర్చించడం కోసం ప్రధాని ఒరిస్సా సీఎం కు ఫోన్ చేసిన పీఎం తమకు మాత్రం ఫోన్ చేయలేదని తృణముల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్రమోడీపై ఆరోపణలు సంధించింది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయం దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం తోపాటు ప్రధాని సైతం వివరణ ఇచ్చారు. రెండు సార్లు పీఎం కార్యాలయం నుండి ప్రధాని మాట్లాడాతారని ఫోన్ చేసిన నేపథ్యంలో మమతా బెనర్జీ అందుబాటులోకి రాలేదని తెలిపారు.ఈ నేపథ్యంలోనే గవర్నర్ తో ఫోన్లో మాట్లాడినట్టు వారు తెలిపారు.

నేరుగా మమతాపై ఫైర్ అయిన ప్రధాని

నేరుగా మమతాపై ఫైర్ అయిన ప్రధాని

ఈ నేపథ్యంలోనే బెంగాల్ ర్యాలీలో పాల్గోన్న ప్రధాని మోదీ మమతా పై విమర్శలు సంధించారు. తుఫాను ప్రభావం పై కూడ మమత బెనర్జీ రాజకీయాలు చేస్తుందని ప్రధాని మోడీ స్వయంగా విమర్శించారు. పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఫొని తుఫాను తాకిందని తెలియడంతో తాను ఫోన్ చేశానని అయితే మమతా బెనర్జీ మాత్రం స్పందించలేదని, తెలిపారు. ఆమే ఫోన్ కోసం ఎదురు చూశానని అన్నారు. మమతతో మాట్లాడేందుకు రెండు సార్లు ఫోన్ చేసిన అందుబాటులోకి రాలేదని ప్రధాని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. దీంతో మమతా బెనర్జీ ఇరుకున పడింది.

ప్రధానికి గట్టి షాక్ ఇచ్చిన దీదీ

ప్రధానికి గట్టి షాక్ ఇచ్చిన దీదీ

అయితే ప్రధాని వ్యాఖ్యలపై మమతా బెనర్జి ఘాటుగా స్పందించింది. ప్రస్థుతం ఎన్నికలు జరుగుతుండడంతో త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌పైరి కానునున్నాడని ఆయనతో నేను వేదికను పంచుకోవాలని అనుకోవడం లేదని నేరుగా కౌంటర్ ఇచ్చింది. ప్రధాని ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చారని ఈనేపథ్యంలో ఆయనతో తుఫాన్ ప్రభావం పై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కోంది. దీంతో పాటు ఖరగ్‌పూర్ ర్యాలీలో ఉన్న నేపథ్యంలోనే ప్రధాన మంత్రి మాట్లాడలేదని అయినా ఎన్నికల నేపథ్యంలో ప్రధానితో మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికల అనంతరం రానున్న కొత్త ప్రధానమంత్రితో చర్చిస్తామని తేల్చి చెప్పింది.

English summary
Bengal Chief Minister Mamata Banerjee today declared that she has not returned Prime Minister Narendra Modi's calls to discuss Cyclone Fani, as she "does not want to share dais with expiry-PM". Earlier today,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X