• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెక్స్ మార్పిడి, స్త్రీ అనుభూతికి యోని అవసరంలేదు : గౌరీ అరోరా

|

న్యూఢిల్లీ : సెక్స్ మార్పిడి శస్త్ర చికిత్సల ద్వారా అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయిన మోడల్ గౌరీ అరోరా ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన ఫోటోలను షేర్ చేసింది. ఇదే క్రమంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన గౌరీ అరోరా.. స్త్రీ అనే అనుభూతి పొందడానికి యోని తప్పనిసరిగా ఉండాలని తాను భావించడం లేదని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ప్రస్తుతం ఆమె సెక్స్ మార్పిడి ఇంకా చికిత్స దశలోనే ఉండగా.. త్వరలోనే రొమ్ముకు శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం తాను మెడిసిన్స్ వాడుతున్నానని శారీరకంగా తాను ఎప్పుడు సంసిద్దత వ్యక్తం చేస్తే.. అప్పుడు వైద్యులు తనకు సెక్స్ మార్పిడి శస్త్ర చికిత్స చేస్తారని గౌరీ అరోరా ప్రకటించింది. పూర్తి లింగమార్పిడి జరిగేందుకు ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశముందని తెలిపింది.

I don’t need a vagina to look or feel feminine: Gauri (Gaurav) Arora

లింగమార్పిడి విషయాన్ని తాను సిగ్గుచేటు వ్యవహారంగా భావించడం లేదని ఈ సందర్భంగా గౌరీ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. చుట్టూ ఉన్న సమాజంతో పాటు, కుటుంబ సభ్యులందరూ తన సెక్స్ మార్పిడిని వ్యతిరేకించినా.. తాను మాత్రం సెక్స్ మార్పిడి గురించి టీవీ షోలో ప్రకటన చేశానని చెప్పింది గౌరీ.

ఎవరికి ఇష్టమున్నా..! లేకున్నా..! వారి ఇష్ట ప్రకారం తాను ఉండలేనని, తనకు నచ్చినట్టే జీవితం గడుపుతానని గౌరీ స్పష్టం చేసింది. 'సెక్స్ మార్పిడి శస్త్రచికిత్స చేయించేందుకు నా తండ్రి మద్ధతు ఇవ్వలేదు. సోదరి నాతో మాట్లాడటం లేదు. నా తల్లి నా వైపే ఉన్నా ముందుకు రావడం లేదు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

English summary
Model Gaurav Arora who appeared on reality show Splitsvilla in 2015 has transformed himself into a woman and wants to be called Gauri Arora now. While he shared his glamorous pictures on Instagram posing like a girl, he says a sex change surgery might take a year or two.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more