వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బులు తీసుకొన్నట్టు గుర్తులేదు,ఆ డైరీలో ఎవరిపేర్లున్నాయో నాకెలా తెలుసు

తాను డబ్బులు తీసుకొన్నట్టు గుర్తులేదన్నారు డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా ధీక్షిత్. సహరా గ్రూప్ నుండి ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో సుమారు కోటి రూపాయాలు తీసుకొన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తన ట్విట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :సహరా డైరీల వ్యవహరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అదే పార్టీకి చెందిన డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కు కూడ చుట్టుకొన్నాయి.సహరా నుండి షీలాకు కూడ ముడుపులు ముట్టాయనే కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ లో ఉంది.అయితే తాను డబ్బులు తీసుకొన్నట్టు గుర్తుకు లేదన్నారామె. ఈ విషయంలో తాను ఏమీ మాట్లాడబోనని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహరా గ్రూప్ నుండి సుమారు 40 కోట్లు ఆయనకు ముట్టజెప్పిందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సహరా గ్రూప్ నుండి ఎవరెవరికి ఎంత ముట్టాయనే విషయమై కాంగ్రెస్ పార్టీ ఓ జాబితాను విడుదలచేసింది.

i don't rember taking money from sahara group

ఈ జాబితాతో మాజీ డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చిక్కులో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో షీలీ దీక్షిత్ పేరు కూడ ఉంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సహారా నుండి తీసుకొన్నవారి జాబితాను ట్విట్టర్ లో పోస్టుచేసింది.2013 సెప్టెంబర్ 23వ, తేదిన సహరా గ్రూప్ నుండి డిల్లీ ముఖ్యమంత్రిగా ఆనాడు ఉన్న షీలా దీక్షిత్ కోటి రూపాయాలను తీసుకొన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

సహరా గ్రూప్ నుండి డబ్బులు తీసుకొన్నట్టు తనకు గుర్తుకు లేదన్నారామె. కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడబోనని తేల్చిచెప్పారు. ఈ విషయమై తాను ఇప్పుడేమీ మాట్లాడానని ఆమె చెప్పారు. తన పేరును ఈ వివాదంలోకి లాగవద్దని ఆమె కోరారు.

తనకు ఈ వ్యవహరంతో సంబంధం లేదనన్నారు. ఏ డైరీ ఎవరి డైరీ, అందులో ఎవరు ఏం రాశారో తనకు తెలియదన్నారు షీలా దీక్షిత్.ఈ విషయం గురించి మాట్లాడేందుకు తన వద్ద సమాచారం లేదన్నారు. మరో వైపు తన పేరును ఇందులోకి లాగకూడదని ఆమె కోరారు. తాను ఈ విషయమై కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేనని చెప్పారు,.

English summary
i don't rember taking money says sheila dikhsit , former delhi chief minister stongley denied the charges of bribe from sahara group. congress party put out a list linked to it on twitter in which a reference to its leader sheil dikshit also allegedly figured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X