వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు భార్య ఉంది. నేను మగాళ్లతో పడుకోను

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల వేళ కర్నాటక కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధం పార్టీ పరువును గంగలో కలుపుతోంది. కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్, పార్టీ సీనియర్ నేత కెహెచ్ మునియప్పల మధ్య టికెట్ కేటాయింపు విషయంలో నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. మునియప్పపై చేసిన కామెంట్స్ కు కౌంటర్ గా స్పీకర్ రమేష్ చేసిన వ్యాఖ్యలు జుగుత్స పుట్టిస్తున్నాయి.

ఎట‌కారం అట‌కెక్క‌..! మ‌ర్రి చెట్టుకి రావి చెట్టుకి పెళ్లి.. ! 2వేల మంది అతిధులు..!!ఎట‌కారం అట‌కెక్క‌..! మ‌ర్రి చెట్టుకి రావి చెట్టుకి పెళ్లి.. ! 2వేల మంది అతిధులు..!!

ఇంతకీ ఏం జరిగిందంటే

ఇంతకీ ఏం జరిగిందంటే

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వరుసగా ఏడుసార్లు గెలుపొందిన మునియప్పకు మరోసారి కోలార్ నియోజకవర్గ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే మునియప్పపై పార్టీలో, బయట తీవ్రమైన ఆరోపణలు ఉండటంతో స్పీకర్ తో పాటు పలువురు ఆయన ఆభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కుటుంబసభ్యులకు అవకాశాలు ఇస్తూ కార్యకర్తలను అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మునియప్పను టార్గెట్ చేస్తూ రమేష్ కుమార్ ఆయనపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. అయితే గత నెలలో ఓ కార్యక్రమానికి హాజరైన మునియప్ప రమేష్ కుమార్ ను ఉద్దేశిస్తూ మా మధ్య ఎలాంటి విబేధాలులేవని, మేమిద్దరం భార్యభర్తల్లాంటి వారమని అన్నారు.

నేను మగాళ్లతో పడుకోను

నేను మగాళ్లతో పడుకోను

మునియప్ప దాదాపు నెల రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. భార్యభర్తల్లాంటి వారమంటూ మునియప్ప చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. నేను మగాళ్లతో పడుకోను. నాకు ఓ లీగల్ వైఫ్ ఉంది. ఆయనకు ఆసక్తి ఉందేమో కానీ నాకు లేదు అంటూ జుగుత్సాకర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేయడంపై దుమారం రేగింది. మనస్తాపానికి గురైన మునియప్ప ఈ విషయం గురించి ఫిర్యాదు చేస్తూ పార్టీ అధినాయకత్వానికి లేఖ రాశారు.

వివాదాలు కొత్త కాదు

వివాదాలు కొత్త కాదు

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కడం స్పీకర్ రమేష్ కుమార్ కు కొత్తేమీ కాదు. గతంలో ఆడియో టేపుల విషయంలోనూ ఆయనపై ఆరోపణలు రాగా.. తన పరిస్థితి అత్యాచార బాధితురాలిగా మారిపోయిందని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపైన దుమారం రేగడంతో పార్టీ ఒత్తిడి మేరకు క్షమాపణ చెప్పారు.

English summary
A bizarre exchange between two top Congress leaders in Karnataka has once again exposed festering infighting within the party, which has been ruling the state in an alliance since May last year. The two leaders, Ramesh Kumar and KH Muniyappa, have been squabbling over a constituency ahead of next month's national election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X