మద్దతు ఎవరికి లేదు: రజనీ, క్యూలైన్లో ఖుష్బూ(ఫోటో)
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు రాజధాని చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు సూచన చేశారు. అందరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని రజనీకాంత్ ప్రజలకు, తన అభిమానులకు సూచించారు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎవరికైనా మద్దతు ఇస్తున్నారా అని విలేకరులు ప్రశ్నిస్తే... తాను ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నానని, ప్రజలు కూడా అదే చేయాలని సూచించారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా తన ఓటును వినియోగించుకున్నారు.
క్యూలో భర్తతో ఖుష్బూ
ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) నాయకురాలు, ఆ పార్టీ ప్రధాన ప్రచారకురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె చెన్నైలో తన భర్త సుందరంతో కలిసి ఓటు వేశారు. ఓటు వేసేందుకు ఆమె క్యూ లైన్లో నిలబడ్డారు.

కాగా, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 117 లోకసభ స్థానాలలో ఆరోదశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 2076 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలనుంది. తమిళనాడులో 39, మహారాష్ట్ర 19, ఉత్తరప్రదేశ్ 12, మధ్యప్రదేశ్ 10, బీహార్లో 7, ఛత్తీస్ గఢ్ 7, పశ్చిమబెంగాల్ 6, అస్సాం 6, రాజస్థాన్ 5, జార్ఖండ్ 4, జమ్మూకాశ్మీర్ 1, పుదుచ్చెరి 1 స్థానాల్లో పోలింగ్ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications