వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అత్త ఆస్తులు నాకు అవసరం లేదు, జయ వారసురాలిని నేనే, ఆర్ కె నగర్ లో పోటీచేస్తా'

తనకు తన మేనత్త దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు అవసరం లేదని, ఆమె ఉపయోగించిన పెన్నును కూడ తాను వాడబోనని దీప జయకుమార్ ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉపయోగించిన పెన్నును కూడ తాను తాకబోనని జయలలిత మేనకోడలు దీప జయకుమార్ ప్రకటించారు.జయలలిత ఆస్తులు తనకు ముఖ్యం కాదని ఆమె చెప్పారు.ఆర్ కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను పోటీచేస్తానని ఆమె ప్రకటించారు.అమ్మకు తానే అసలైన వారసురాలినని ఆమె ప్రకటించారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జయంతిని పురస్కరించుకొని మెరీనాబీచ్ వద్ద జయ సమాధివద్ద దీపజయకుమార్ శుక్రవారం నాడు నివాళులర్పించారు.

జయలలిత ఆస్తులు తనకు ముఖ్యం కాదని దీప ప్రకటించారు.పోయేస్ గార్డెన్ తమకే చెందుతోందని దీప సోదరుడు జయకుమార్ ప్రకటించిన విషయాన్ని మీడియా ప్రతినిధులు దీప వద్ద ప్రస్తావించగా దీప ఈ విధంగా స్పందించారు. జయలలిత ఉపయోగించిన పెన్నును కూడ తాను ఉపయోగించబోనని ఆమె ప్రకటించారు.

గత ఏడాది జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ఆమెను కలిసి తాను శుభాకాంక్షలు చెప్పిన విషయాన్ని దీప గుర్తుచేసుకొన్నారు.ఈ ఘటనను తాను జీవితంలో మర్చిపోలేనని ఆమె ప్రకటించారు.

జయలలిత ఆస్తులు నాకు అవసరం లేదు

జయలలిత ఆస్తులు నాకు అవసరం లేదు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు తనకు అవసరం లేదని ఆమె మేనకోడలు దీప జయకుమార్ ప్రకటించారు.జయలలిత వాడిన పెన్నును కూడ తాను ముట్టుకోనని ఆమె ప్రకటించారు.జయలలిత దీవెనలు తనకు ఉంటే చాలునని ఆమె కోరుకొన్నారు.అంతే కాదు జయలలిత ఎల్లప్పుడూ తనతోనే ఉంటారనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

పన్నీర్ సెల్వంతో కలిసి పనిచేసే ప్రసక్తేలేదు

పన్నీర్ సెల్వంతో కలిసి పనిచేసే ప్రసక్తేలేదు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో తాను కలిసి పనిచేసే ప్రసక్తేలేదని దీప జయకుమార్ ప్రకటించారు. అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి పదవిని స్వీకరించేందుకు రంగం సిద్దమైన తరుణంలో పన్నీర్ సెల్వానికి దీప మద్దతుగా నిలిచారు. పన్నీర్ కూడ దీపతో మంతనాలు కొనసాగించారు. అయితే ప్రస్తుతం పన్నీర్ సెల్వంతో తాను కలిసి పనిచేసే ప్రసక్తేలేదని దీపజయకుమార్ ప్రకటించారు.

ఆర్ కె నగర్ నుండి పోటీకి దిగుతా

ఆర్ కె నగర్ నుండి పోటీకి దిగుతా

జయలలిత మరణంతో ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఈ అసెంబ్లీ స్థానం నుండి తాను బరిలోకి దిగుతానని దీప జయకుమార్ ప్రకటించారు.జయలలితకు అసలైన వారసురాలిని తానేనని ఆమె ప్రకటించారు.జయలలిత ఆశయాల సాధన కోసం తాను కృషి చేస్తానని ఆమె చెప్పారు.

జయలలిత జయంతిని పురస్కరించుకొని పోటాపోటీ కార్యక్రమాలు

జయలలిత జయంతిని పురస్కరించుకొని పోటాపోటీ కార్యక్రమాలు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జయంతిని పురస్కరించుకొని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో పార్టీ నాయకులు , ముఖ్యమంత్రి పళని స్వామి నేతృత్వంలో పోటాపోటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం నాయకత్వంలో పార్టీ సీనియర్ నాయకుడు మధుసూదన్ నేతృత్వంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఉచిత దుస్తుల పంపిణీ, రక్తదాన శిభిరాలు పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జయలలిత పేరిట సావనీర్ ను విడుదల చేసేందుకుగాను పళనిస్వామి వర్గం ప్రయత్నిస్తోంది.అయితే అమ్మ పేరిట జెండాలు ఎగురవేయాలని పన్నీర్ వర్గం ఆదేశించింది

English summary
“I Don’t Want Any Assets Of Jayalalithaa Except Her Pen” said Deepa Jayakumar.deepa jaya kumar pay tribute to jayalalithaa at merina beach on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X