వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూస్తానీ ముస్లింగా గర్వపడుతున్నా... రాజ్యసభలో గులాంనబీ ఆజాద్ భావోద్వేగ స్పీచ్...

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మంగళవారం(ఫిబ్రవరి 9) రాజ్యసభలో భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ నెల 15తో తన రాజ్యసభ పదవీకాలం ముగుస్తుండటంతో వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ... కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశవ్యాప్తంగా తాను ప్రేమాభిమానాలను చూరగొన్నానని అన్నారు.

'ఇంతవరకూ పాకిస్తాన్‌‌లో అడుగుపెట్టని అదృష్టవంతుల్లో నేను కూడా ఒకడిగా ఉన్నాను. పాకిస్తాన్‌లో పరిస్థితుల గురించి చదివినప్పుడల్లా... ఒక హిందూస్తానీ ముస్లింగా నేను చాలా గర్వపడుతాను. దేశంలో తిరుగుబాట్లు,ఉగ్రవాదం అంతం కావాలని అల్లాను ప్రార్థిస్తున్నాను.' అని ఆజాద్ పేర్కొన్నారు. 2005లో తాను జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

 i feel proud to be Hindustani Muslim Ghulam Nabi Azad emotional speech in rajya sabha

అంతకుముందు ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ... గులాంనబీ ఆజాద్‌కు వీడ్కోలు చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. 'ఉద్యోగాలు,పదవులు,అధికారాలు వస్తాయి.. పోతాయి.. కానీ వాటిని ఎలా నిర్వహించాలో గులాం నబీ ఆజాద్‌ను చూసి నేర్చుకోవాలి.' అని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని మరొకరు భర్తీ చేయడం కష్టమన్నారు. ఆజాద్ స్థానంలోకి వచ్చే వ్యక్తి ఆయన పనితీరుతో సరితూగడం కష్టమని పేర్కొన్నారు. ఎందుకంటే... ఆజాద్ పార్టీ గురించే కాదు దేశం గురించి కూడా చాలా పట్టింపుతో ఉండేవాడన్నారు.

జమ్మూకశ్మీర్‌లో గుజరాతీ యాత్రికులపై ఉగ్రదాడి జరిగినప్పుడు తనకు ముందు ఫోన్‌ చేసింది ఆజాదే అని మోదీ గుర్తుచేసుకున్నారు. ఆ రాత్రి తనకు ఫోన్‌ చేసి దాడి గురించి చెబుతూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారని గుర్తుచేసుకున్నారు. ఆజాద్ తనకు నిజమైన స్నేహితుడని... ప్రతీ ఒక్కరినీ తన కుటుంబ సభ్యుడి లాగే చూసుకుంటారని చెప్పారు. ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

గులాం నబీ ఆజాద్‌పై మోదీ సోమవారం కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. 'గులాంనబీ ఆజాద్ అంటే నాకెంతో గౌరవం. విపక్షంలో ఉన్నప్పటికీ ఆయన ఎంతో హుందాగా మాట్లాడుతారు. ఎప్పుడూ అసభ్య పదజాలం ఉపయోగించరు. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నా. కొత్తగా సభలో అడుగుపెట్టేవారు అజాద్‌ నుంచి స్ఫూర్తి పొందవచ్చు.' అని మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లో బ్లాక్‌, జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలను బాగా నిర్వహించాని ఆజాద్‌ జీ మెచ్చుకున్నారని... కాంగ్రెస్ కూడా ఆజాద్‌ను స్పూర్తిగా తీసుకుంటుందని ఆశిస్తున్నానని చెప్పారు.

English summary
It was a day of emotional speeches in Rajya Sabha as the members came together to bid farewell to the retiring MPs.After a teary-eyed tribute by PM Narendra Modi to the Congress veteran, Ghulam Nabi Azad thanked the MPs as he recounted his political journey from Jammu and Kashmir to New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X