వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగ్గనిపించింది: మాజీ ప్రియుడి వాడియాపై జింతా

By Pratap
|
Google Oneindia TeluguNews

I feel unsafe and ashamed as a woman, Preity Zinta says
ముంబై: తన మాజీ ప్రియుడు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, తనను దూషిస్తున్నప్పుడు తనకు సిగ్గనిపించిందని, పూర్తిగా అభద్రతకు గురయ్యానని బాలీవుడ్ నటి ప్రీతీ జింతా అన్నారు. వాడియాపై మెరైన్ డ్రైవ్ పోలీసులకు ఆరు పేజీల ఫిర్యాదు చేశారు.

గత పదేళ్లుగా వాడియా తనకు తెలుసునని, తమ మధ్య సంబంధం కూడా ఉందని, కొంత కాలం క్రితం తాము తెగదెంపులు చేసుకున్నామని, తాము కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహయజమానులం అయినప్పటికీ వృత్తిపరమైన సంభాషణతోనే సరిపుచ్చేవాళ్లమని ఆమె వివరించారు.

తాము కొంత కాలంగా మాట్లాడుకోవడం లేదని, ఈ మధ్య ఒకటి రెంజు సార్లు తమ మధ్య వాగ్వివాదం జరిగిందని, వాడియా తనను దూషించే ప్రయత్నం చేశాడని, పూర్తి అమర్యాదతో కూడిన భాషను తనపై ప్రయోగించారని ఆయన అన్నారు. సహోద్యోగులు, మిత్రులు, కుటుంబ సభ్యుల ముందు తాను సిగ్గుపడేలా వ్యవహరించాడని ఆమె ఆరోపించారు.

బెంగళూర్ ఐపియల్ మ్యాచ్ సందర్భంగా తన పక్కన కూర్చోవాలని అడిగాడని, తాను వినకపోవడంతో తనపై కఠినంగా, కోపంగా అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు.

English summary
Bollywood actor Preity Zinta, who is also co-owner of the Kings XI Punjab IPL team, registered an FIR against her former boyfriend Ness Wadia, alleging that he molested, abused and threatened her inside Wankhede stadium in south Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X