జయలలిత అంటే ప్రేమ, కాని, ఆమెకు చెప్పలేదు:కట్జూ
ముంబై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంటే తాను పడిచచ్చేవాడినని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు.ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
తాను యవ్వనంలో ఉన్నప్పుడు జయలలిత అంటే తనకు చాలా ఇష్టం ఉండేదన్నారు. ఆమె చాలా అందంగా ఉండేదని అనుకొనేవాడినని ఆయన గుర్తు చేసుకొన్నారు. మనస్సులో ఉండిపోయిన ఆ ప్రేమ గురంచి జయలలితకు తెలియదన్నారు. ఆమె 1948 ఫిబ్రవరిలో జన్మిస్తే, తాను 1946 సెప్టెంబర్ లో పుట్టానని ఆయన చెప్పారు.

2004 నవంబర్ లో తాను చెన్నై రాజ్ భవన్ లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేశానని, ఆ సమయంలో ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఈ సందర్భంగానే ఆమెను తొలిసారి కలుసుకొన్నానని ఆయన చెప్పారు.
ఆమె అప్పటికీ కూడ అందంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తన యవ్వనంలో కలిగిన భావవనను అప్పుడు ఆమెకు చెప్పడం సరికాదని అనిపించిందని ఫేస్ బుక్ లో కట్జూ రాశారు.
జయలలితను తాను రెండు దఫాలు కలిసిన సమయంలో గుర్తులను నెమరువేసుకొన్నారు.కట్జూ, జయలలిత పక్కన కూర్చున్న ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టి షేర్నీ ఔర్ షేర్ అంటూ కామెంట్ పెట్టాడు. జయలలిత అంటే అపారమైన గౌరవాన్ని చూపెట్టిన ఆయన తాజాగా తన యవ్వనంలో ప్రేమను వ్యక్తపర్చాడు.