• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మిమ్మల్ని సీఎంగా చూడాలనుకుంటున్నా: స్టాలిన్‌తో మోహన్ బాబు

By Srinivas
|

చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తాను కోరుకుంటున్నానని ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు. కోయంబత్తూరులో జరిగిన కరుణానిధి సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సోదరా.. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని మోహన్ బాబు.. స్టాలిన్‌తో అన్నారు. కరుణానిధి గొప్ప తండ్రి అన్నారు. మోహన్ బాబు ఆదివారం ట్వీట్ కూడా చేశారు. కరుణానిధి ఒక గొప్ప లెజెండరీ ఫాదర్ అన్నారు.

I hope to see you as the Chief Minister, Mohan babu on MK Stalin

కరుణానిధితో, ఆయన కుటుంబంతో మోహన్ బాబుకు మంచి స్నేహం ఉంది. తమిళనాడులో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నప్పటి నుంచి వారిద్దరి మధ్య పరిచయం ఉంది. సినిమా పరిశ్రమ హైదరాబాదుకు తరలి వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. మోహన్ బాబు సినిమా కార్యక్రమాలకు కూడా కరుణ హాజరైన సందర్భాలు ఉన్నాయి.

English summary
Thank You my brother MK Stalin for inviting me for the condolence meeting in Coimbatore for your great legendary father. I wish you all the best and hope to see you as the Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X