వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా ప్రజలకే వదిలేశా: నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Narendra Modi First Exclusive Interview Of 2019

న్యూఢిల్లీ: తన నాలుగున్నరేళ్ల పాలనపై ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన పాలనపై సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని తాను వారికే వదిలేస్తున్నానని చెప్పారు. ఆయన ఏఎన్ఐకి సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో జీఎస్టీ, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రయిక్స్ తదితర అంశాలపై మాట్లాడారు.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో సుదీర్ఘంగా అధికారంలో ఉండటం వల్లే ప్రజా వ్యతిరేకత కారణంగా ఓడిపోయామని చెప్పారు. ఇక తెలంగాణ, మిజోరాంలలో గెలుస్తామని తాము చెప్పలేదన్నారు.

తాను ఎంత తిట్టినా పడతానని, రక్షణ వ్యవస్థకు అవసరమైనవన్నీ చేకూర్చుతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాయి విసిరి పారిపోతుందని, రాఫెల్ వ్యవహారంలో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

I leave it to people to decide whether satisfied or not with my work: Narendra Modi

2016లో సరిహద్దు వెంబడి పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరాలపై ఆర్మీకి చెందిన ప్రత్యేక కమెండోలు మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేసిన విషయమై స్పందించారు. నాడు యూరీలో జరిగిన ఉగ్రదాడులు సైనికులు మృతి చెందిన ఘటనతో భారత సైన్యమే కాదు, తాను కూడా ఎంతో ఉద్వేగానికి గురయ్యానన్నారు. ఈ నేపథ్యంలోనే సర్జికల్ స్ట్రయిక్స్‌కు వ్యూహం రూపొందించడం జరిగిందన్నారు.

ఆపరేషన్ చాలా రిస్క్‌తో కూడుకున్నదని తనకు తెలుసని చెప్పారు. భద్రతా దళాల భద్రతను దృష్టిలో పెట్టుకుని సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించే తేదీల్లో రెండుసార్లు మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఆపరేషన్‌లో విజయం సాధించినా, వైఫల్యం చెందినా పట్టించుకోనని, సూర్యదోయానికి ముందే వెనక్కి వచ్చేయాలని సైన్యానికి స్పష్టమైన ఆదేశాలిచ్చిన విషయాన్ని మోడీ గుర్తు చేశసుకున్నారు. ఈ ఆపరేషన్లో మన సైనికులెవ్వరూ మృతి చెందకూడదన్న స్థిర నిశ్చయం కారణంగానే ఒకవేళ విఫలమైనా గడువు మాత్రం పొడిగించకుండా ముగించుకుని రావాలని సైన్యాన్ని నాడు కోరడం జరిగిందన్నారు.

English summary
'I leave it to people to decide whether satisfied or not with my work. But one thing, I am not surprised, I could neither make the Lutyen’s world part of me or me a part of them.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X