వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్టుబాట్లను కాదని, చీరె కట్టి ..బొట్టు పెట్టిన బ్రిటన్ ప్రధాని

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు : భారత దేశ సంస్కృతి సంప్రదాయాలంటే విదేశీయులు గౌరవిస్తుంటారు. దేశంలోని ఆచార వ్యవహారాలను అతి దగ్గర నుండి పరిశీలిస్తుంటారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ఆచరించేందుకుు కొందరు విదేశీయులు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.సామాన్యుల సంగతేమో కాని, సాక్షాత్తూ బ్రిటన్ ప్రదానమంత్రి తన కట్టుబాట్లను కాదని భారత సంప్రదాయం ప్రకారంగా నడుచుకోవడం పట్ల పలువురు ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

భారత్ లో రెండు రోజుల పర్యటన కోసం బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే వచ్చారు. ఆమె తన పర్యటనలో భాగంగా బెంగుళూరులోని బిజి బిజీగా గడిపారు.ఈ పర్యటనలో భాగంగా ఆమె తమ దేశం సంస్కృతి , సంప్రదాయాలను పక్కనపెట్టింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా చీరను ధరించారు. భారతీయ వనిత మాదిరిగాను బొట్టు పెట్టుకొన్నారు.

i like indian traditon, and culture britan prime minister

భారతీయ స్త్రీ మాదిరిగానే ఆమె తన కట్టుబొట్టును మార్చారు. దేవాలయానికి సంప్రదాయ భారతీయ వనిత మాదిరిగానే వెళ్ళి దైవ దర్శనం చేసుకొన్నారు.తనకు బహుమతిగా వచ్చిన బంగారు రంగా పట్టుచీరను ధరించి ఆమె కర్ణాటక రాష్ట్రంలోని హలసూరులోని సోమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.భారతీయ సంప్రదాయాల ప్రకారం చీరకట్టుతో వచ్చిన బ్రిటన్ ప్రధానిని చూసి స్థానికులు ఆశ్చర్యపడ్డారు.

మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగానే దేవాలయంలో శివలింగానికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవాలయ పాలకమండలి ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.భారత, బ్రిటన్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకొన్నట్టు ఆమె చెప్పారు. భారత సంస్కృతి సంప్రదాయాలంటే తనకు గౌరవమని ఆవె వివరించారు.భారతీయ సంస్కృతి ప్రకారంగా దేవాలయానికి వచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రిని పలువురు అభినందించారు.

English summary
britan prime minister theresa may come to india for two days visit.sha very much like indian culture. she is visit halanur someshwaraswamy temple with saree. temple management grand welcome to primeminister. I love indian traditon and als culture said therisa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X