వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ట్రంప్‌ను బురిడీ కొట్టించిన మోదీ.. కోటి మంది రానందుకు ప్రతీకారం తప్పదేమో..’

|
Google Oneindia TeluguNews

అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఇలా జరుగుతుందని ప్లాన్ చేసినవాళ్లకు ముందే తెలుసు.. ఎదుటివాళ్ల అబ్సెషన్ ను క్యాష్ చేసుకునే ప్రక్రియ జరిగిందివాళ.. అంటూ అమెరికా ప్రెసిడెంట్ భారత పర్యటనపై దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పేలారు. అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో సోమవారం నిర్వహించిన 'నమస్తే ట్రంప్' నేపథ్యంపై ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేసిన వర్మ.. మోదీ తెలివితేటల్ని మెచ్చుకుంటూనే, ట్రంప్ ద్వారా ఎదురయ్యే ప్రమాదాలనూ ప్రస్తావించారు.

Recommended Video

Namaste Trump : Twitter War On Trump Pronunciations | Oneindia Telugu
మోదీ సూపర్..

మోదీ సూపర్..

బిజీ షెడ్యూల్ లో సైతం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ను ఇండియాకు రప్పించడంలో ప్రధాని నరేంద్ర మోదీ సక్సెస్ అయ్యారని, భారీ జనసందోహం పట్ల ట్రంప్ కు ఉన్న అబ్సెషన్ ను మోదీ ఆవిధంగా వాడుకున్నారని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ‘‘ట్రంప్ బలహీనతపై మోదీ ఆడిన గేమ్ నాకు చాలా బాగా నచ్చింది. కోటి మందిని రప్పిస్తానని చెప్పి పర్యటన ఖరారు చేయించారు. నిజానికి నమస్తే ట్రంప్ సభకు వచ్చింది లక్షమందే''అరి పేర్కొన్నారు.

ప్రతీకారం తప్పదా?

‘‘నిజం చెప్పాలంటే మీటింగ్ కు ఎంత మంది హాజరయ్యారో ట్రంప్ లెక్కించే పరిస్థితిగానీ, ఆ లక్కల్ని పట్టించుకునే పరిస్థితిగానూ ఉండదు. స్టేడియంలో ఉన్న లక్ష మందిని చూసి.. కోటి మందిగా ట్రంప్ ఊహించుకుని ఉంటారు. కానీ ఇందులో భారత్ కు ప్రమాదం పొంచిఉంది. నమస్తే ట్రంప్ సభకు లక్ష మందే వచ్చారన్న చేదువాస్తం గ్రహిస్తే.. ట్రంప్ ఇండియాతో ట్రేడ్ డీల్ క్యాన్సిల్ చేసుకునే ప్రమాదముంది. అసలే అవతలివాళ్లపై ప్రతీకారం తీర్చుకునే విషయంలో ట్రంప్ జగమొండి''అని ఆర్జీవీ రాసుకొచ్చారు.

ట్రంప్ ఫేస్ చూడాలనుంది..

అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటనపై సోమారం ఉదయం నుంచీ రాంగోపాల్ వర్మ సెటైర్లు పేల్చారు. ఏ దేశ ప్రజలు కూడా మరో దేశానికి వెళ్లి సాంస్కృతిక కార్యక్రమాలు చూడబోరని, ఇండియాలో దారిపొడవునా ఏర్పాటు చేసిన కల్చరల్ ఈవెంట్స్ ను ట్రంప్ ఎలా ఫీలై ఉంటారో, వాటిని చూసినప్పుడు ఆయన ముఖకవళికలు ఎలా ఉంటాయో చూడాలనుందన్నారు. అతిథులకు అట్టహాసంగా మర్యాదలు, స్వాగతాలు పలకడం ఫ్యూడల్ సంస్కృతికి నిదర్శనమని, అమెరికా లాంటి దేశాలు చాలా ఏళ్ల కిందటే ఆ సంప్రదాయాన్ని వదులుకోగా.. ముర్ఖపు వారసత్వం కారణంగా ఇండియాలో ఇప్పటికీ ఆ కల్చర్ కొనసాగుతున్నదని వర్మ మండిపడ్డారు.

English summary
film director ram gopal verma once again targets us president donald trump on his india visit. says pm narendra modi played on Donald Trump's obsession for crowds
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X