వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం బయటివాడ్ని కాను, అర్థం లేదు: అజరుద్దీన్

By Pratap
|
Google Oneindia TeluguNews

I'm not an outsider in India: Azharuddin
న్యూఢిల్లీ: స్థానికేతరుడనే ఉద్దేశంతో కాంగ్రెసు కార్యకర్తలు టోంక్ - సవాయ్ మధోపూర్ నియోజకవర్గంలో తనకు సహకరించడం లేదనే మాటను ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ తోసిపుచ్చారు. భారతదేశంలోని ఓ ప్రాంతంలోనైనా పనిచేయడానికి తనకు హక్కు ఉందని, అలా పనిచేయకూడదనే ఆంక్షలు ఏవీ లేవని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో మొరాదాబాద్ లోకసభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అజరుద్దీన్‌కు ప్రస్తుతం పోటీ చేస్తున్న నియోజకవర్గంలో అజరుద్దీన్‌కు పార్టీ కార్యకర్తల నుంచి సహకారం లభించడం లేదని, స్థానికులకే టికెట్ ఇవ్వాలని ప్రదర్శనలు చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ విధమైన అర్థంలేని మాటలను తాను విశ్వసించబోనని, చెన్నైకి చెందిన వ్యక్తులు పని చేయడానికి ముంబై వెళ్తారని, భారతదేశంలో ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉందని ఆయన అన్నారు.

పార్టీ కార్యకర్తలు తనకు సహకరిస్తున్నారని, రాజస్థాన్ నుంచి పోటీ చేస్తున్నందుకు తనకు ఆనందంగా ఉందని ఆయన పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. పార్టీకి, ప్రజలకు సేవ చేయడానికి తనకు ఓ వేదికను కల్పించారని ఆయన అన్నారు.

రాజస్థాన్ నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం తనను ఆదేశించిందని, అందుకు తనకు సంతోషంగా ఉందని, తాను క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి రాజస్థాన్‌కు సంబంధించి మంచి జ్ఞాపకాలున్నాయని, రాజస్థాన్ తన పట్ల ఎప్పుడూ దయాపూరితంగానే ఉందని, తాను ప్రజలను కలుస్తున్నానని, మొరాదాబాద్‌లో తాను చాలా అభివృద్ధి పనులు చేపట్టానని, ఇప్పుడు టోంక్ మాధోపూర్‌లో కూడా అటువంటి పనులు చేస్తానని అజర్ అన్నారు.

English summary
Cricketer-turned-MP Mohammad Azharuddin has dismissed as "useless talk" reports of non- cooperation by Congress workers in his Tonk-Sawai Madhopur constituency for being seen as an 'outsider', saying there is no restriction on anyone to work anywhere in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X