వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ఆలా కాదు: నీరవ్ మోడీ పరారీపై కార్తి చిదంబరం వ్యంగ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తనను దురుద్దేశంతోనే అరెస్టు చేశారని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం అన్నారు. బుధవారం చెన్నై విమానాశ్రయంలో సిబిఐ అధికారులు అరెస్టు చేసిన తర్వాత కోర్టులో ఆ విధంగా అన్నారు.

మద్రాసు హైకోర్టు అనుమతితోనే తాను విదేశాలకు వెళ్లానని దర్యాప్తు అధికారులకు తాను పూర్తిగా సహకరించానని ఆయన కోర్టులో చెప్పారు. ఆయనను సిబిఐ అధికారులు అరెస్టు చేసి పాటియాల కోర్టులో హాజరు పరిచారు.

ప్రభుత్వానికి గురి పెట్టిన కార్తి

ప్రభుత్వానికి గురి పెట్టిన కార్తి

తాను హిందుస్తాన్ లీవర్ కాదు గానీ హిందూస్తాన్ రిటర్నర్ (హిందుస్తాన్ నుంచి వెళ్లిపోయేవాడిని కాదు, హిందూస్తాన్‌కు తిరిగి వచ్చేవాడిని) అని ఆయన అన్నారు. కార్తి తరపున కోర్టులో కాంగ్రెసు సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ వాదించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై బిజెపి ప్రభుత్వ తీరును తప్పు పట్టడానికి కార్తి ఆ మాటలన్నట్లు అర్థమవుతోంది.

Recommended Video

CBI Arrests Karti Chidambaram : What is the INX Media Case
నీరవ్ మోడీ పరారీపైనే...

నీరవ్ మోడీ పరారీపైనే...

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో నిందితుడు నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో మోడీ ప్రభుత్వంపై కాంగ్రెసు పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తూ వస్తోంది.

రాజకీయ నేత కుమారుడ్ని కాబట్టి అరెస్టు

రాజకీయ నేత కుమారుడ్ని కాబట్టి అరెస్టు

రాజకీయ నేత కుమారుడిని కాబట్టే తనను లక్ష్యంగా చేసుకున్నారని కార్తి విమర్శించారు తన విదేశీ పర్యటనల విషయంలో సిబిఐ వాస్తవాలు చెప్పడం లేదని అన్నారు. కోర్టు అనుమతితోనే తాను విదేశాలకు వెళ్లానని, తనకు తాజా సమన్లు ఏవీ రాలేదని ఆయన చెప్పారు

రివార్డుగానే అరెస్టు

రివార్డుగానే అరెస్టు

సమన్లకు స్పందించినందుకు రివార్డుగానే అరెస్టు చేశారని, వ్యక్తి స్వేచ్ఛకు అరెస్టు అత్యంత భంగకరమని అన్నారు. బాస్‌ల ముందు ప్రదర్శనకే సిబిఐ అరెస్టు చేసిందా అని ఆయనయ అడిగారు.

కార్తికి సిబిఐ కౌంటర్

కార్తికి సిబిఐ కౌంటర్

కార్తి వాదనను సిబిఐ కౌంటర్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కార్తి సహకరించారని, విదేశాలకు వెళ్లే ముందు సమాచారం తమకు ఇవ్వలేదని చెప్పిది. కార్తి చిదంబరాన్ని తమ కస్టడీకి 15 రోజులు అప్పగించాలని కోరింది. ఒక్క రోజు కస్టడీకి కోర్టు అనుమతించింది.

English summary
Karti Chidambaram told a Delhi court that the arrest was malafide since he had travelled abroad with permission from the Madras High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X