వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ దయతోనే సీఎం అయ్యా.. మీ చేతిలో ఆటబొమ్మను కాదు.. కాంగ్రెస్‌కు కుమార ఝలక్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటకలో కుమారస్వామి సర్కార్ పడిపోయిన తర్వాత కాంగ్రెస్ జేడీఎస్‌ల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది. మాజీ సీఎం కుమారస్వామి మరో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.కాంగ్రెస్ వల్లే సర్కార్ కూలిపోయిందని అప్పట్లో కుమారస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రెండు పార్టీల మధ్య అని చెప్పడం కంటే కుమారస్వామి, సిద్ధరామయ్యల మధ్య వార్ తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు.

 కాంగ్రెస్ డ్రామాలు తెలుసు

కాంగ్రెస్ డ్రామాలు తెలుసు

కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలు తనకు తెలుసని చెప్పిన కుమారస్వామి, లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా ఎందుకు వైఫల్యం చెందామో సిద్ధరామయ్య చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య కుమారస్వామి ఎప్పుడూ ఆలోచించకుండా మాట్లాడుతారని కౌంటర్ ఇచ్చారు. జేడీఎస్‌కు చెందిన మాజీ మంత్రి జీటీ దేవెగౌడ ఓట్లన్నీ బీజేపీకి వెళ్లాలని చెప్పారని దీన్ని బట్టి గేమ్స్ ఎవరు ఎవరితో ఆడుతున్నారని సిద్ధరామయ్య ప్రశ్నించారు.

నేను సిద్ధరామయ్య చిలకను కాదు

సిద్ధరామయ్య ప్రశ్నకు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. తనను ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ అని సిద్ధరామయ్య కాదన్న విషయాన్ని ఆయన గుర్తెరగాలని చెప్పారు. సిద్దరామయ్య చెప్పినట్లు చేసేందుకు తాను పంజరంలో చిక్కుకుపోయిన చిలకను కాదని స్పష్టం చేశారు. చాలా మంది తన తండ్రి దేవెగౌడ హయాంలో వర్థిల్లినవారేనని చెబుతూ ఇందులో సిద్ధరామయ్య కూడా ఒకరని గుర్తు చేశారు. సిద్ధరామయ్య ముందుగా జేడీఎస్‌లో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్‌పార్టీలోకి వచ్చారని పరోక్షంగా కుమారస్వామి చురకలంటించారు. కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిన సూచనలు పాటించకపోవడం వల్లే తన ప్రభుత్వం నిలబడలేదని చెప్పారు.

సిద్ధరామయ్య వల్లే మాండ్యాలో ఓటమి

సిద్ధరామయ్య వల్లే మాండ్యాలో ఓటమి

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రాంతీయ అభిమానంతో తాము జేడీఎస్ ఏర్పాటు చేశామని సిద్ధరామయ్య కాంగ్రెస్‌ను వీడి ప్రాంతీయ పార్టీ పెట్టగలరా అని సవాల్ విసిరారు కుమారస్వామి. మాండ్యా లోక్‌సభ స్థానంలో సిద్ధరామయ్య బీజేపీకి సహకరించడం వల్లే అక్కడ జేడీఎస్ ఓడిపోయిందని చెప్పారు. అక్కడ ఓటమికి కాంగ్రెస్ పార్టీపై తను నిందవేయనని చెప్పిన కుమారస్వామి... కేవలం సిద్ధరామయ్య వల్లే ఓడిపోయామని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ తనకు ఏమాత్రం మద్దతుగా నిలిచిందో చెప్పాలి

కాంగ్రెస్ తనకు ఏమాత్రం మద్దతుగా నిలిచిందో చెప్పాలి


తనకు కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలవలేదని వారు తనకు ఏ మాత్రం అండగా ఉన్నారో వారే ఆత్మపరిశీలన చేసుకోవాలని కుమారస్వామి చెప్పారు. మైసూరులో కాంగ్రెస్ ఓడిపోయిందంటే అది సిద్ధరామయ్య స్వయంకృతాపరాధమే అని తేల్చి చెప్పారు కుమారస్వామి. తాము కాంగ్రెస్ విజయం కోసం నిజాయితీతో పనిచేశామని అదే నిజాయితీతో జేడీఎస్ కోసం కాంగ్రెస్ పనిచేయలేదని విమర్శించారు. అయితే ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని ఒంటరిగానే బరిలో దిగి తామేంటో సత్తాచాటుతామని కుమారస్వామి తెలిపారు.

English summary
War of words intensified between two Karnataka former CMs Kumara swamy and Siddharamaiah. Kumara swamy said that he doesn't need congress support anymore and that JDS would fight alone in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X