వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుడినే, కేజ్రీ 47 ఏళ్లు వెనుకే: నటుడు మనోజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోషిస్తున్న కామన్ మ్యాన్ (సామాన్యుడు) పాత్రను ఆయన కంటే ముందే తాను తన చిత్రాల్లో పోషించానని బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ అన్నారు. అతను తన కంటే నలభై ఏడేళ్ల వెనుక ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఎఎపి తన హామీలను నెరవేర్చాల్సి ఉందని, ఆ పార్టీ పైన యువత ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. ప్రజల్లో చైతన్యం వస్తోందని, ముఖ్యంగా యువత మేలుకుంటోందని, అందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని చెప్పారు. యువత అన్నింట్లో ముందంజలో ఉన్నారని చెప్పారు.

I played common man years before Kejriwal came: Manoj

కేజ్రీవాల్ పార్టీ తొలి సునామీ తీసుకు వచ్చిందని, దాని వెనుక ఎంత శక్తి ఉందో ఇప్పుడే తెలియదన్నారు. కానీ అది చాలా బలంగా ఉందన్నారు. కేజ్రీవాల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కేజ్రీవాల్ కొత్త చొక్కా లాంటివాడని, దానికి ఉతుకులు పడాల్సి ఉందని చెప్పారు.

రాజకీయాలలో జరుగుతున్న అంశాలు తన యాద్గార్, ఉపకార్ చిత్రాల్లో ఉన్నాయని చెప్పారు. యాగ్గార్ చిత్రంలో తిరుగుబాటుదారు పాత్ర పోషించానన్నారు. అందులో తనది ఫ్యాక్టరీలో వర్కర్ పాత్ర అన్నారు.

English summary
Manoj Kumar, who played powerful roles as the quintessential common man, says the Aam Aadmi government has to fulfill its promises as the youth have a lot of expectation from them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X