వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్జీ

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్జీ తనను వరించిన పద్మభూషణ్ అవార్డును స్వీకరించేందుకు నిరాకరించారు.
"ఈ అవార్డు గురించి నాకు ఏమీ తెలియదు. దాని గురించి ఎవరూ నాకు ఏమీ చెప్పలేదు. వారు నాకు పద్మభూషణ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటే, నేను దానిని అంగీకరించడానికి నిరాకరిస్తున్నాను." అని బుద్ధదేవ్ భట్టాఛార్జీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సీపీఐ(ఎం) వర్గాల ప్రకారం.. అవార్డు తిరస్కరణ అనేది బుద్ధదేవ్ భట్టాచార్జీ, సీపీఐ(ఎం) పార్టీ రెండింటి నిర్ణయం. ఈ ఏడాది పద్మ అవార్డులు అందుకోనున్న వ్యక్తుల పేర్లతో కూడిన జాబితాను జనవరి 25న హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వివిధ రంగాలకు చెందిన 128 మంది ప్రముఖులను పద్మ అవార్డులతో సత్కరించనున్నారు. ఈ జాబితాలో నాలుగు పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్ మరియు 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. 128 అవార్డు గ్రహీతలలో, 34 మంది మహిళలు మరియు జాబితాలో విదేశీయులు/NRI/PIO/OCI వర్గం నుంచి 10 మంది వ్యక్తులు, 13 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.

 I refuse it: Buddhadeb Bhattacharjee on receiving Padma Bhushan

కాగా, రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలలో దివంగత మాజీ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, (మరణానంతరం), దివంగత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ (మరణానంతరం), రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం) ప్రభా ఆత్రే పేర్లు ఉన్నాయి.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీకి పద్మ భూషణ్, మాజీ హోం సెక్రటరీ రాజీవ్ మెహ్రిషిని పద్మ భూషణ్‌తో సత్కరించనున్నారు. దీంతో పాటు మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లను కూడా పద్మభూషణ్ అవార్డుతో సత్కరించనున్నారు. ఇక భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లా, అతని సతీమణికి పద్మభూషణ్‌తో సత్కరించనున్నారు. నీరజ్ చోప్రాను పద్మశ్రీతో సత్కరించనున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీ

ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్‌హసన్‌ పద్మశ్రీ అవార్డులు లభించాయి. తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మశ్రీలు దక్కాయి. అలాగే కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు సంయుక్తంగా పద్మభూషణ్ ప్రకటించింది.

English summary
I refuse it: Buddhadeb Bhattacharjee on receiving Padma Bhushan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X