వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హద్దులు దాటి వీడియోలు చేయాలన్నారు: రాజ్‌కుంద్రాపై షెర్లిన్ సంచలనం

|
Google Oneindia TeluguNews

పారిశ్రామికవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రాకు సంబంధించిన పోర్న్ రాకెట్‌ వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ గలీజ్ దందాలో రాజ్ కుంద్రా పాత్రకు సంబంధించిన విషయాలను బాధితులు బయటపెడుతున్నారు. పోలీసులకు నిజాలను నిర్భయంగా చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా రాజ్‌కుంద్రా అతని పోర్న్ కంపెనీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న బాలీవుడ్ నటి మోడల్ షెర్లిన్ చోప్రా తాజాగా పోలీసులకు కీలక సమాచారం అందించింది.

 హాట్‌షాట్స్ యాప్ కోసం...

హాట్‌షాట్స్ యాప్ కోసం...

పోర్న్ వీడియోలు చేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టు అయిన రాజ్‌కుంద్రా నీలి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆయన సంస్థ బారిన పడి దగాపడ్డ మోడల్స్ క్రమంగా నోరు విప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే షెర్లిన్ చోప్రా పోలీసులకు ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాను నిర్వహిస్తున్న హాట్‌షాట్ యాప్ కోసం తనను కంటెంట్ క్రియేట్ చేయాల్సిందిగా రాజ్ కుంద్రా కోరినట్లు షెర్లిన్ చోప్రా పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.అయితే ఆ యాప్‌పై ఎన్నో అనుమానాలు ఉండటం, మార్కెట్‌లో దానికి అంత మంచి రెప్యుటేషన్‌ లేకపోవడంతో తిరస్కరించినట్లు షెర్లిన్ చెప్పుకొచ్చింది.

 2019లో రాజ్ కుంద్రా సంస్థతో ఒప్పందం

2019లో రాజ్ కుంద్రా సంస్థతో ఒప్పందం

2019లో షెర్లిన్ చోప్రా యాప్ ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు రాజ్‌కుంద్రా తన బిజినెస్ మేనేజర్‌తో కబురు పంపినట్లు షెర్లిన్ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాపై తాను అప్‌లోడ్ చేసే కంటెంట్ ఉచితంగా ఉంటుందని అయితే ఓ కస్టమైజ్డ్ యాప్ ద్వారా దాన్ని మోనిటైజ్ చేసుకోవచ్చని రాజ్‌కుంద్రా చెప్పినట్లు షెర్లిన్ చోప్రా వెల్లడించింది. ఇక 2019లో రాజ్‌కుంద్రాకు చెందిన ఆర్మ్ ప్రైమ్ సంస్థతో తాను ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పిన షెర్లిన్... ఆ తర్వాత ఒప్పందం కొనసాగించేందుకు తాను ఒప్పుకోలేదని వెల్లడించింది. వచ్చే రెవిన్యూలో ఫిఫ్టీ - ఫిఫ్టీ షేర్‌పై తాను అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పింది. దీంతో ఒప్పందం ముగిశాక అప్పటి వరకు చేసిన కంటెంట్‌ను డిలీట్ చేయాలని వెల్లడించింది. కానీ ఇప్పటికీ డిలీట్ చేయలేదని వెల్లడించారు.

Recommended Video

Shilpa Shetty skips her shooting as raj kundra got arrested | Oneindia Telugu
 చాక్లెట్ వీడియోపై పోలీసుల విచారణ

చాక్లెట్ వీడియోపై పోలీసుల విచారణ

కాంట్రాక్ట్ సమయంలో యాప్ కోసం చాలా వీడియోలు చేసినట్లు చెప్పిన షెర్లిన్... అందులో బాగా పాపులర్ అయిన చాక్లెట్ వీడియోపైనే పోలీసులు దృష్టి సారించారు. విచారణలో కూడా ఈ వీడియో కీలకంగా మారింది. ఆ సమయంలో ఆర్మ్స్ ప్రైమ్ క్రియేటివ్ హెడ్‌తో వాగ్వాదం కూడా జరిగిందని గుర్తు చేసింది షెర్లిన్ చోప్రా. చాక్లెట్ వీడియోను ఈస్ట్ అంధేరీలోని ఓ హోటల్‌లో షూట్ చేసినట్లు వివరించింది. ఇక వీడియో షూట్ చేసే సమయంలో మొహమాటాలు పక్కనబెట్టి హాలీవుడ్ మోడల్స్ తరహాలో నగ్నంగా ఫోజులివ్వాలని అప్పటి క్రియేటివ్ హెడ్‌ బలవంతం చేసినట్లు షెర్లిన్ చోప్రా వెల్లడించింది.

ఇదిలా ఉంటే 2020లో ఆర్మ్స్ ప్రైమ్ సంస్థపై ముంబై సైబర్ సెల్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో షెర్లిన్ చోప్రా పేరును చేర్చడంతో... విచారణకు హాజరుకావాలని ఈ నెల 26వ తేదీన నోటీసులు పంపారు. అయితే రాజ్‌కుంద్రాలానే తనను అరెస్టు చేసే అనుమానాలు ఉన్నందున ముందస్తు బెయిల్‌ కోసం బాంబే హైకోర్టును షెర్లిన్ చోప్రా సంప్రదించింది. అయితే జూలై 28వ తేదీన అరెస్టు చేయరాదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

English summary
Shelyn Chopra gave a statement to cyber police that she had refused to shoot a video for hotshots app as she was not satisfied with content.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X