వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనే సాక్ష్యం.. కళ్లారా చూశాను, ఆరోజు ఏం జరిగిందంటే.: కేజ్రీ కొంపముంచిన వీకే జైన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దాడి జరగలేదని ఆప్ ఎమ్మెల్యేలు.. లేదూ దాడి జరిగిందని ఐఏఎస్‌లు.. గత రెండు మూడు రోజులుగా ఢిల్లీలో ఇదే గొడవ నడుస్తోంది. ఇరువరిలో ఎవరూ నిజం చెబుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. నిజంగా దాడి జరిగిందా?, లేక ఆప్ ఆరోపిస్తున్నట్టు ప్రభుత్వాన్ని బలహీనపరచే కుట్రనా? అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సలహాదారు వీకే జైన్‌ ఆయన కొంపముంచారు.

దాడిని కళ్లారా చూశాను: వీకే జైన్

దాడిని కళ్లారా చూశాను: వీకే జైన్

దాడిని తాను స్వయంగా చూశానని వీకే జైన్ బాంబు పేల్చారు. ప్రకాశ్‌పై ఆప్‌ ఎమ్మెల్యేలు అమనుతుల్లా ఖాన్‌, ప్రకాశ్‌ జర్వాల్‌ దాడికి తానే సాక్ష్యం అంటూ కూడా చెప్పారు. సీఎస్‌పై దాడి విచారణలో భాగంగా మెజిస్ట్రేట్ ముందు వీకే జైన్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు.

చీఫ్ సెక్రటరీపై దాడి: లొంగిపోయిన ఆప్ ఎమ్మెల్యే, స్తంభించిన పాలన.. చీఫ్ సెక్రటరీపై దాడి: లొంగిపోయిన ఆప్ ఎమ్మెల్యే, స్తంభించిన పాలన..

ఆరోజు ఏం జరిగింది?:

ఆరోజు ఏం జరిగింది?:

మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంలో అసలు ఆరోజు ఏం జరిగిందో జైన్ చెప్పారు. 'ఆరోజు రాత్రి 11.30గం.కు మహారాణి భాగ్ లోని ఇంటి నుంచి బయలుదేరి అర్థరాత్రి సీఎం నివాసానికి చేరుకున్నాను. ఆ సమయంలో ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నారు. అయితే వాళ్లు ఎందుకు ఉన్నారన్న విషయం నాకు తెలియదు' జైన్ తెలిపారు.

వాష్ రూమ్ వెళ్లొచ్చేసరికి..:

వాష్ రూమ్ వెళ్లొచ్చేసరికి..:

'సీఎంతో సమావేశం జరుగుతున్న సందర్భంగా.. మధ్యలో నేను వాష్ రూమ్‌కు వెళ్లాను. తిరిగొచ్చేసరికి ఎమ్మెల్యేలు ప్రకాష్ జర్వాల్, అమానతుల్లా ఖాన్ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్‌ను కొడుతున్నారు.

'ఎందుకు చేయలేదు' అంటూ వారు అతన్ని కొట్టడం చూశాను. ఆ సమయంలో సీఎస్ కిందపడటంతో.. అతని గడ్డం పట్టుకుని.. వాళ్లు చెప్పిన పని చేయమని అడిగారు. ఈ క్రమంలో సీఎస్ కళ్లజోడు కిందపడిపోయింది.' అని జైన్ తన వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు.

మాట మార్చిన వీకే జైన్..:

మాట మార్చిన వీకే జైన్..:

మెజిస్ట్రేట్ ముందు తాను దాడిని కళ్లారా చూశానని చెప్పిన వీకే జైన్.. అంతకుముందు పోలీసుల విచారణలో మాత్రం మరోలా జవాబిచ్చాడు. ఆ సమయంలో తాను వాష్ రూమ్ వెళ్లినందువల్ల ఏం జరిగిందో చెప్పలేనని అన్నారు.

సీఎంను విచారించనున్నారు..:

సీఎంను విచారించనున్నారు..:


కేసులో ఇప్పటికే సీఎస్ అన్షు ప్రకాష్ ను ప్రశ్నించిన పోలీసులు.. ఈరోజు సీఎం కేజ్రీవాల్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ పోలీసులకు ఎలాంటి సమాధానం చెబుతారు.. కేసు నుంచి ఆప్ బయటపడుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.

English summary
In a dramatic twist in the case of the alleged assault on Delhi chief secretary Anshu Prakash at the chief minister's residence, the CM's advisor, V K Jain, has told the police that he had witnessed two MLAs - Amanatullah Khan and Prakash Jarwal - hitting the CS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X