• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేను చాయే అమ్మాను! దేశాన్ని కాదు: కాంగ్రెస్‌ను ఏకిపారేసిన మోడీ

|

రాజ్‌కోట్: గుజరాత్ రాష్ట్రంలో ప్రచారం మొదలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు కురిపించారు. 'ఓ పేదోడు ప్రధానమంత్రి కావడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఔను నేను పేదవాడినే. నేను చాయ్ అమ్ముకున్నా. కానీ, దేశాన్ని కాదు' అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ తన మాతృభూమి అని, ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి తన జీవితం మొత్తాన్ని అర్పిస్తానని మోడీ అన్నారు. పటేళ్లకు రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ మాటలు విని మోసపోవద్దంటూ ఆయన పిలుపునిచ్చారు. జన సంఘ్ మద్దతుతోనే పటేల్ సామాజిక వర్గానికి చెందిన బాబుభాయ్ పటేల్ సీఎం అయ్యారని మోడీ గుర్తు చేశారు. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్.. ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టిందని ఆరోపించారు.

I sold tea, but not the nation: Modi strikes back at Congress

సౌరాష్ట్రకే చెందిన కేశుభాయ్ పటేల్ సీఎం అయినప్పుడు కూడా కాంగ్రెస్ ఆయనను గద్దె దించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించిందని, ఆనందిబెన్ పటేల్ విషయంలోనూ ఇదే జరిగిందని మోడీ చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ గుజరాత్‌ను మోసం చేస్తూనే ఉన్నదని ఆయన మోడీ అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటేనని మోడీ విమర్శించారు.

గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలను కాంగ్రెస్ మంటగలపకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని సమస్యలకు అభివృద్ధే పరిష్కారమని, ఆ అభివృద్ధి కొనసాగుతూనే ఉండాలని ప్రధాని మోడీ అన్నారు.

'సర్దార్ పటేల్‌ను కాంగ్రెస్ అవమానించినా గుజరాత్ ప్రజలు భరించారు. ఇక వాళ్ల ఆత్మ గౌరవంపై దాడిని ఏమాత్రం సహించలేరు. గుజరాత్ ఎప్పటికీ కాంగ్రెస్‌ను క్షమించదు' అని మోడీ అన్నారు. గుజరాత్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ సరిగా చూడలేదని, ఈ రాష్ట్రం వెనుకబడాలన్నదే వాళ్ల లక్ష్యమని విమర్శించారు.

నీతి, నియత్ లేని పార్టీ

కాంగ్రెస్ ఒక నీతి, నియత్ లేని పార్టీ మోడీ విమర్శించారు. తనపై బుదర జల్లినందుకు సంతోషమని, ఎందుకంటే కమలం బురదలోనే వికసిస్తుందని కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. పదవి కోసం ఇక్కడ లేమని, ఇండియాను అత్యున్నత శిఖరాలకు చేర్చడమే తన లక్ష్యమని మోడీ స్పష్టంచేశారు. గుజరాత్ తన ఆత్మ అయితే.. భారత్ పరమాత్మ అని చెప్పారు.

'2008లో ముంబై దాడులు, తర్వాత యూరి దాడి జరిగింది. ఈ రెండు దాడుల తర్వాత ఏ ప్రభుత్వం ఎలా స్పందించిందో చూస్తే కాంగ్రెస్ గురించి మీకు తెలిసిపోతుంది. పాకిస్థాన్ కోర్టు అక్కడి ఉగ్రవాదిని రిలీజ్ చేస్తే కాంగ్రెస్ పండుగ చేసుకుంటోంది. ఇదే కాంగ్రెస్ మన ఆర్మీని నమ్మలేదుగానీ.. చైనా రాయబారిని విశ్వసించింది' అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

English summary
Prime Minister Narendra Modi will on Monday address rallies in different parts of Saurashtra and south Gujarat, where polling for the first phase of assembly polls will be held on December 9.గుజరాత్ రాష్ట్రంలో ప్రచారం మొదలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు కురిపించారు. ‘ఓ పేదోడు ప్రధానమంత్రి కావడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఔను నేను పేదవాడినే. నేను చాయ్ అమ్ముకున్నా. కానీ, దేశాన్ని కాదు’ అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X