వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చదివింది కన్నడలో, ఓస్థాయి వచ్చింది అక్కడే: బాంబు పేల్చిన హీరో రజనీకాంత్ !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Rajinikanth political entry : రాజకీయాల్లోకి నో 'కామెంట్' అంటున్న రజనీకాంత్

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ వ్యాఖ్యలు విన్న తమిళనాడు ప్రజలు ఒక్క సారిగా షాక్ కు గురైనారు.

ఫ్యాన్స్ తో రజనీకాంత్ !

ఫ్యాన్స్ తో రజనీకాంత్ !

చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో గత ఐదు రోజుల నుంచి అభిమానులతో సూపర్ స్టార్ రజనీకాంత్ సమావేశం అయ్యి వారితో ఫోటోలు తీసుకుంటున్నారు. శనివారం అభిమానులతో రజనీకాంత్ సమావేశం అయ్యారు.

కన్నడ, ఉద్యోగం

కన్నడ, ఉద్యోగం

అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన రజనీకాంత్ తన విద్యాభ్యాసం మొత్తం కన్నడ బాషలోనే జరిగిందని చెప్పారు. కర్ణాటకలో కన్నడ బాష మాట్లాడిన తాను బెంగళూరులో ప్రభుత్వ ఉద్యోగం (బస్సు కండెక్టర్) సంపాధించానని రజనీకాంత్ గుర్తు చేశారు.

 ఫ్యామిలీ మొత్తం కన్నడ

ఫ్యామిలీ మొత్తం కన్నడ

తనతో పాటు తన కుటుంబ సభ్యులు కన్నడ మాట్లాడుతారని, తన సోదరులు కన్నడ బాష నేర్చుకున్నారని రజనీకాంత్ బాంబు పేల్చారు. అయితే తనకు సంపూర్ణ జీవితం ఇచ్చింది మాత్రం తమిళ ప్రజలు అని రజనీకాంత్ చెప్పారు.

ఆయన చెప్పారని తమిళ్

ఆయన చెప్పారని తమిళ్

మా గురువు బాలచందర్ తనను తమిళ బాష నేర్చుకోమని సూచించారని, అప్పటి నుంచి తమిళం మాట్లాడటం అలవాటు చేసుకున్నారని రజనీకాంత్ అన్నారు. తన జీవితం కోసం తమిళ బాషను నేర్చుకుని నేడు ఈ స్థాయిలో ఉన్నానని రజనీకాంత్ వివరించారు.

కావేరీ వివాదం ఉంటే ఇలా ?

కావేరీ వివాదం ఉంటే ఇలా ?

నిత్యం కావేరి నీటి కోసం కర్ణాటకతో గొడవపడే తమిళ ప్రజలు సూపర్ స్టార్ రజనీకాంత్ మాటలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడో తమిళనాడుకు వచ్చి స్థిరపడిన రజనీకాంత్ అభిమానుల ఉద్దేశించి కన్నడ బాష మీద ఉన్న ప్రేమను బయటకు చెప్పడంతో ఆయన మీద విమర్శలు చెయ్యడానికి వేచి ఉన్న వారికి మంచి అస్త్రం చిక్కిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Actor Rajinikanth expresses his love for Kannada, I studied in Kannada and grew up in Karnataka. He added that his family members are also Kannadigas and speak in Kannada said Super star Rajinikanth in Chennai on December 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X