వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6గురి కూతుళ్ళకు కోటిన్నర కట్నమిచ్చిన ఛాయ్ వాలా

కూతుళ్ళ పెళ్ళి ఖర్చు భరించాలంటేనే కొంతమంది తల్లిదండ్రులు ఉన్న ఆస్తులను విక్రయిస్తారు. లేదా అప్పులు చేస్తారు. మరికొందరు తల తాకట్టు పెడతారు.అయితే ధనవంతులు మాత్రం తమ కూతుళ్ళ పెళ్ళిళ్ళను ఆడంబరంగా చేస్తారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

జైపూర్: కూతుళ్ళ పెళ్ళి ఖర్చు భరించాలంటేనే కొంతమంది తల్లిదండ్రులు ఉన్న ఆస్తులను విక్రయిస్తారు. లేదా అప్పులు చేస్తారు. మరికొందరు తల తాకట్టు పెడతారు.అయితే ధనవంతులు మాత్రం తమ కూతుళ్ళ పెళ్ళిళ్ళను ఆడంబరంగా చేస్తారు. అయితే రాజస్థాన్ కు చెందిన ఓ ఛాయ్ వాలా తన కూతుళ్ళకు కోటిన్నర కట్నం ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకొన్నాడు.

ఛాయ్ వాలాకు ఇంత డబ్బు ఎక్కడిదంటూ ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లీలారామ్ గుజ్జర్, రాజస్థాన్ లో కొత్పుట్టీ సమీపంలోని వాదులా వద్ద ఓ టీ స్టాల్ ను నడుపుతున్నాడు. ఏప్రిల్ 4వ, తేదిన ఆయన తన ఆరుగురు కూతుళ్ళకు కోటిన్నర కట్నం ఇచ్చి ఈ నెల 4వ, తేదిన వివాహం జరిపించాడు.

అయితే తన కూతుళ్ళ వివాహలను పురస్కరించుకొని స్థానిక కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన పెళ్ళి వేడుకలో ఆయన పెద్ద పెద్దగా నోట్లను లెక్కపెడుతూ కట్నాన్ని అందించాడు.దీంతో బుదవారం నాడు చాయ్ వాలాకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది.

గురువారం వరకు ఆయనకు సమయాన్ని ఇచ్చింది ఆదాయపు పన్నుశాఖ. ఒకవేళ రిటర్న్స్ ను దాఖలు చేయకపోతే ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆదాయపు పన్నుశాఖ ఆ నోటీసులో పేర్కోంది.కోటిన్నర కట్నాన్ని లెక్కలో చూపని ఆదాయం కిందకు వస్తే తదుపరి విచారణను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది.

మరో వైపు నలుగురు మైనర్లకు గుజ్జర్ వివాహం జరిపించడం కూడ ఆయన మెడకు చుట్టుకొంది. ఇద్దరు పెద్ద కూతుళ్ళ పెళ్ళికి మాత్రమే ఆహ్వాన పత్రికలు పంపి, మరో నలుగురు మైనర్ కూతుళ్ళకు కూడ వివాహం జరిపించారు.అయితే నోటీసులు పంపిన తర్వాత గుజ్జర్ కుటుంబసభ్యులు ఇంట్లో లేరని పోలీసులు చెప్పారు.

English summary
A tea seller is under the income tax department's scanner for allegedly dishing out Rs 1.51 crore as dowry for his six daughters at their April 4 wedding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X