వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయావతి సోదరుడికి ఐటీ శాఖ షాక్.. రూ.400కోట్ల ఆస్తులు సీజ్..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి సోదరుడికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన దాదాపు రూ.400కోట్ల విలువైన ఏడెకరాల భూమిని జప్తు చేసింది. దీనికి సంబంధించి ఐటీ శాఖ బినామీ ప్రొహిబిషన్ యూనిట్ జులై 16న ఉత్తర్వులు జారీ చేయగా... దాన్ని గురువారం అమలు చేశారు. ఆనంద్ కుమార్‌తో పాటు ఆయన భార్య విచితర్ లత పేరుపై ఉన్న న్యూఢిల్లీ, నోయిడాలోని ఆస్తులను జప్తు చేశారు.

I-T dept attaches Rs 400 crore-worth property of Mayawatis brother

ఆనంద్ కుమార్‌ను గత జూన్‌లో బీఎస్పీ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించారు. నోయిడా అథారిటీలో క్లర్కుగా పనిచేసిన ఆయన.. అనంతరం నకిలీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు రుణాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనంద్ 49 కంపెనీలు ప్రారంభించారు. దీంతో ఆయన ఆస్తుల విలువ ఒకేసారి రూ.1316 కోట్లకు చేరింది. దీనిపై అప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆనంద్ కుమార్ ఆస్తులపై విచారణ ప్రారంభించింది. తాజాగా ఐటీ శాఖ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్ 1988 సెక్షన్ 24(3) ప్రకారం చర్యలు ప్రారంభించింది.

English summary
Income Tax department on Thursday attached plot of land belonging to the former Uttar Chief Minister and BSP supremo Mayawati’s brother and his family. The attached land is believed to be worth Rs 400 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X