వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: టీ అమ్మకందారు వద్ద రూ. 400 కోట్లు, సీజ్

టీ అమ్ముకుంటూ బతికి.. వడ్డీ వ్యాపారిగా ఎదిగిన సూరత్‌లోని ఒక ఫైనాన్షియర్ ఇంట్లో ఏకంగా రూ. 400 కోట్ల ఆస్తులు వెలుగు చూశాయి.

|
Google Oneindia TeluguNews

సూరత్: పెద్ద నోట్ల అనంతరం అనేక మంది నల్లకుబేరులు బయటపడుతున్నారు. తాజాగా, మరో నల్లధనవంతుడి వెలుగులోకి వచ్చాడు. టీ అమ్ముకుంటూ బతికి.. వడ్డీ వ్యాపారిగా ఎదిగిన సూరత్‌లోని ఒక ఫైనాన్షియర్ ఇంట్లో ఏకంగా రూ. 400 కోట్ల ఆస్తులు వెలుగు చూశాయి. అందులో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, రూ.95 లక్షలు విలువచేసే కొత్త 2000 నోట్లు సహా రూ.1.33 కోట్ల నగదు, రూ.7 కోట్ల విలువ చేసే బంగారు నగలు, రూ.72 లక్షల విలువైన వెండి వస్తువులున్నాయి.

దాడులు జరిపిన ఐటీ అధికారులు ఈ మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. కమీషన్ పద్ధతిలో పాత నోట్ల ను కొత్తనోట్లతో మార్పిడి చేస్తున్నాడన్న సమాచారంతో కిశోర్ భజియావాలా అనే ఫైనాన్షియర్ నివాసాల్లో, ఆయన బంధువుల ఇళ్లలో మంగళవారం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ పట్టుబడిన సొమ్ము, ఆస్తుల విలువను శనివారం లెక్కించారు. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

tea seller

ఇతడు సూరత్ ప్రజా సహకార బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో దాదాపు 30 ఖాతాలను, 16 లాకర్లను నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 31 ఏళ్ల క్రితం సౌరాష్ట్ర నుంచి సూరత్‌కు వచ్చిన కిశోర్ భజియావాలా బ్యాంకు రుణం తీసుకుని ఉద్నాగంలో చిన్న టీ దుకాణం తెరిచాడు. తర్వాతి కాలంలో బజ్జీలు కూడా అమ్మేవాడు. దాంతో భజియావాలా అయ్యాడు.

తన వ్యాపారం పెరిగిన తర్వాత వడ్డీలకు ఇవ్వడం మొదలు పెట్టి.. దానినే తన వృత్తిగా మల్చుకున్నాడు. అప్పులు తీర్చలేని వారి నుంచి వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేవాడని పోలీసులు తెలిపారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఉధానా బ్రాంచ్ సూరత్ జిల్లా సహకార బ్యాంకుకు సంచుల కొద్దీ పెద్దనోట్లను పట్టుకెళ్లినట్టు సమాచారం. అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

English summary
The Income Tax Department on Saturday raided the premises of city-based tea seller-turned-financier Kishore Bhaijyawala and seized cash worth approximately Rs 400 crores, including cash, bullion, jewellery and property papers from his possession.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X