చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై నగరానికి రైళ్లలో నీటీ సరఫరా...! నీటీని అందిస్తున్న కేరళకు ధన్యవాదాలు.. పళని స్వామి

|
Google Oneindia TeluguNews

తమిళనాడు రాష్ట్ర్ర రాజధాని చెన్నై నగరం గత కొద్ది రోజులుగా తీవ్ర నీటి కొరతను ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే..అయితే తమిళనాడుకు నీటిని అందించేందుకు కేరళ ముందుకు వచ్చింది. తమ రాష్ట్ర్రం నుండి చెన్నైనగర వాసుల కోసం సుమారు 20 లక్షల లీటర్ల నీటిని ట్రాక్టర్ల ద్వార అందిస్తామని కేరళ ప్రభుత్వం తెలిపింది.అయితే ఈ నిర్ణయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ముందు తిరస్కరించారు.

ఈనేపథ్యంలోనే డీఎంకే అధినేత స్థాలిన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇది అవివేక చర్యగా అభివర్ణించారు. దీంతో నీటి ఎద్దడిపై సమీక్షించిన పళని స్వామి కేరళ ఇచ్చిన ఆఫర్‌ను నేడు అంగీకరించారు. ఇందుకోసం కేరళ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ కూడ పంపనున్నట్టు ప్రకటించారు.

I thank Kerala CM who came forward to provide water to Tamil Nadu :CM, Palaniswami:

మరోవైపు చెన్నై నగర వాసుల దాహం తీర్చేందుకు రైల్వే ద్వార జోలార్‌పెట్టాయి రిజర్వాయర్ నుండి ప్రతి రోజు 10 ఎమ్‌ఎల్‌డీ నిటీని పంపిణీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక రాజ్యసభలో కూడ తమిళనాడు నీడీ ఎద్దడి అంశాన్ని ఏఐఏడీఎంకే విజిలా సత్యనాథన్ లేవనెత్తారు. తక్షణమే చెన్నై నగర నీటి ఎద్దడిపై కేంద్రం జోక్యం చేసుకుని కావేరి నది నుండి నీటీ విడుదలకు చర్యలు చేపట్టాని ఆమే కోరారు.

ఇక చైన్నై నగరానికి నీటి సమస్య లేకుండా ప్రధాన వణరుగా ఉన్న ముళ్లపెరియార్ డ్యామ్‌లో అధికంగా నీటిని నిల్వ ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపిన ముఖ్యమంత్రి, ఇందుకోసం కెరళ ప్రభుత్వం సహకరించాలని పళని స్వామి కోరారు..

English summary
Tamil Nadu CM, Edappadi K. Palaniswami: I thank Kerala CM who came forward to provide water to Tamil Nadu, I will write to him soon.govt is working to strengthen Mullaperiyar Dam in order to store more water.. he urge Kerala govt to cooperate with us on this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X