వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరికొత్త భారత్‌ను నిర్మిస్తున్నాము... ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

భారత దేశంలో తాము ప్రభుత్వాన్ని మాత్రమే ఏర్పాటు చేయలేదని, సరికొత్త భారత దేశాన్ని నిర్మిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ నేడు యునెస్కో కార్యాలయంలో భారతీయులను ఉద్దేశించి ప్రసగించారు. ఈ నేపథ్యంలోనే నవభారత నిర్మాణం కోసం భారత్ కృషి చేస్తుందని తెలిపారు. ఇందుకోసమే అవినీతీని అంతం చేస్తూ, కుటుంభ రాజకీయాలను చెక్ పెట్టామని చెప్పారు.దీంతోపాటు ఉగ్రవాదాన్ని రూపుమాపుతున్నామని తెలిపారు. కాగా ఇలాంటీ చర్యలను గత ప్రభుత్వాలు తీసుకులేదని అన్నారు.

ఇక రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత 75 రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పిన మోడీ, ఈ నేపథ్యంలోనే గత అయిదేళ్లలో అనేక సానుకూల నిర్ణయాలు తీసుకన్నామని అన్నారు.ఇందులోభాగంగనే 75 బిల్లులు పాస్ చేశామని చెప్పారు. భారత్ చేపట్టిన అనేక నిర్ణాయాల్లో చంద్రయాన్ 2 ప్రయోగమని చెప్పారు.చంద్రయాన్ 2 ల్యాండింగ్ తర్వాత భారత్ కూడ ఎలైట్ దేశాల సరసన చేరుతుందని చెప్పారు. ఇక భారత్ ఫ్రాన్స్‌ల మధ్య దౌత్య సంబంధాలు మరింత పురోగతి సాధిస్తాయని చెప్పిన మోడీ ఉగ్రవాదం, వాతవరణంపై కలిసి పోరాటం చేస్తున్నాయని చెప్పారు. ఈనేపథ్యంలోనే రెండు దేశాలు అనేక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నాయని చెప్పారు.

I very well know the importance of a goal :PM Modi

స్టార్ట్ అప్‌ల విషయంలో భారత్ ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే జల్‌శక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామని ,నీటీ సమస్యల పరిష్కారానికి ఆ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని తెలిపారు.ఇక ఈజ్ ఆఫ్ లివింగ్‌లో కూడ భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఇక ఇండియాలోని "ఇన్, ఫ్రాన్స్ ఫ్రా తీసుకుంటే ఇన్‌ఫ్రా అవుతుందని అన్నారు. ఫుట్ బాల్‌‌ క్రీడకు ఫ్రాన్స్ కంటే భారతీయులే ఎక్కువగా అభిమానులు ఉన్నారని ,ఫుట్‌బాల్‌లో గోల్‌కు ఉన్నంత ప్రాముఖ్యత అందరికి తెలుసని, అందుకే ఆ గోల్‌ను సాధిస్తే అత్యున్నత స్థానాలకు వెళ్లినట్టేనని అన్నారు.

English summary
"I have come to a nation of football lovers. You very well know the importance of a goal. That is the ultimate achievement. In last five years, we set goals which were earlier considered impossible to fulfill."PM Modi said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X