• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

6ఫీట్ల ప్రియురాలు కావాలి: భారత పొడగరి యశ్వంత్(వీడియో)

|

ముంబై: అన్ని సక్రమంగా ఉంటేనే టీనేజ్‌ కుర్రాళ్లకే గర్ల్‌ ఫ్రెండ్స్ దొరకడం కష్టం. అలాంటిది ఏకంగా ఆరడుగుల 7అంగుళాల పొడవున్న బక్క పలచటి 14ఏళ్ల యశ్వంత్‌ రావత్‌ అనే పాఠశాల విద్యార్థికి గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలంటే మామూలు విషయమేమీ కాదు.

అయితే, ఈ కుర్రాడు కచ్చితంగా 8 అడుగుల వరకు పొడుగు పెరుగుతాడని డాక్టర్లు చెప్తుండటం గమనార్హం. ఇప్పటికే ఎవరూ(ప్రియురాలు) దొరకడం లేదంటే 8అడుగులు వరకు పెరిగే ఎలా అని దిగులుచెందుతున్నాడు యశ్వంత్. ఒకవేళ 8అడుగుల వరకు యశ్వంత్ పెరిగే ప్రపంచ రికార్డే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన పాఠశాల విద్యార్థి యశ్వంత్‌కు తన పెళ్లికి సరిజోడు దొరకదని ఇప్పటి నుంచే బెంగ పట్టుకున్నది. తాను ఎనిమిది అడుగుల వరకు పెరిగితే పెళ్లికి సరిజోడు దొరక్క పోవచ్చని, బహూశ ఆ వయస్సులో పెళ్లి కూడా జరక్క పోవచ్చని బాధ పడుతున్నాడు. కనీసం ఈ ఎత్తుకు ఈ వయస్సులోనైనా గర్ల్‌ ఫ్రెండ్‌ దొరికితే బాగుండునని, తనలో కాన్ఫిడెన్స్‌ పెరుగుతున్నదని తనను కలసిని ఓ మీడియాతో వాపోయాడు.

'I want a girlfriend who measures up'

'నా కాళ్లకు సరిపడ 15నెంబర్‌ బూట్లే కష్టంగా దొరికాయి. నాకు టైలర్‌ ప్యాంట్‌ కుట్టాలన్నా ఇబ్బంది పడతారు. ఇక నిత్య జీవితంలో నేను పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. స్కూల్‌ డెస్క్‌లో సరిగ్గా కూర్చోలేను. తరగతి గదిలోకి వెళ్లాలన్నా, ఇంట్లో గుమ్మాలు దాటాలన్నా వంగి, వంగి ఇబ్బంది పడాల్సిందే. మంచం మీద పడుకుంటే చేతులు, కాళ్లు బయటే. బస్సెక్కాలంటే టాప్‌ లేచిపోద్ది. కారులో సరిగ్గా కూర్చోలేను. నలుగురిలోకి వెళితే అందరూ నావైపే చూస్తారు. కొందరు లంబూ' అంటూ పిలుస్తుంటారని చెప్పాడు.

అంతేగాక, 'కొందరు అమితాబ్‌ బచ్చన్‌ అంటారు. అప్పుడప్పుడు నన్ను వీధిలో నిలబెట్టి ఫొటోలు తీసుకుంటుంటే మాత్రం సెలబ్రిటి అయిపోయాననిపిస్తుంది. పొడుగు పెరగాలని అనుకున్నాను. కానీ ఇంతలా కాదు. నా పొడువు బాస్కెట్‌ బాల్‌ ఆటకు సరిపోతుంది కనుక బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడిని కావాలని, ఏదో రోజు భారత్‌ తరఫున ఆడాలని కోరుకుంటున్నాను' అని యశ్వంత్‌ తన గురించి తాను చెప్పుకొచ్చాడు.

యశ్వంత్‌ తండ్రి బ్రహ్మదేవ్‌ రావత్‌ ఎత్తు ఐదు అడుగుల ఐదు అంగుళాలే. తల్లి సుమన్‌ రావత్‌ నాలుగు అడుగుల ఐదు అంగుళాలే. వారికి పుట్టిన యశ్వంత్‌ ఇంత పొడువు అవుతారని వారు కలలో కూడా అనుకోలేదు. బిడ్డ కడుపులో ఉండగా, ఏం తిన్నావంటూ ఇరుగు పొరుగు వారు అప్పుడప్పుడు తనను అడుగుతుంటారని సుమన్‌ చెప్పారు.

ఏం తిన్నానో తనకే గుర్తు లేదని, ఇక తానేమి చెబుతానని అన్నారు. ప్రస్తుతం సామాజికంగా తన కొడుకుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారు. గిన్నీస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. అందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా 18 ఏళ్లు వచ్చే వరకు ఆగాలని వారు సూచించారని తెలిపారు.

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన కెవిన్‌ బ్రాడ్‌ఫోర్డ్‌ 18ఏళ్ల లోపు కేటగిరీలో గిన్నీస్‌ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన పొడవు ఏడు అడుగుల ఒక అంగుళం ఉన్నారు. ఆయన పొడవును క్రాస్‌ చేశాక యశ్వంత్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ఇక భారత్‌లో అత్యంత పొడవైన వ్యక్తిగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 32 ఏళ్ల ధర్మేంద్ర సింగ్‌ ఉన్నారు. ఆయన పొడవు ఎనిమిది అడుగుల ఒక అంగుళం. అయితే పాఠశాల స్థాయిలో భారతదేశంలో అత్యంత పొడవైన విద్యార్థిగా యశ్వంత్ రికార్డు సృష్టించాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
For most teenage boys, finding a girlfriend is difficult enough. But for India's longest teenager Yashwant Raut it's an even taller order as he fears he will never find a girl who measures up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more