వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను కూడ లైంగిక వేధింపులకు గురయ్యా, తాకరాని చోట ఇలా: పూనమ్ మహజన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: తాను కూడ లైంగిక వేధింపులకు గురయ్యాయని బిజెపి ఎంపీ పూనమ్ మహజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలోని ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో ఈ రమైన లైంగిక వేధింపులకు గురై ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు.

ఉత్తర ముంబైకి చెందిన బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ లో జరిగిన రెడ్ బ్రిక్ సదస్సులో పూనమ్ మహజన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ దశలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని చెప్పారు. ఇండియాలో ప్రతి యువతి ఎప్పుడో ఒకప్పుడు వేధింపులకు గురయ్యారని అన్నారు. తాకరాని చోట తాకడం వంటివి ప్రతి మహిళకూ ఎదురయ్యేవేనని అన్నారు. ఓ మోస్తరు తెలివితేటలతోనూ పురుషులు రాజకీయాల్లో రాణించగలరని, మహిళల్లో అసాధారణత ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు.

Poonam Mahajan

, "వర్లీ నుంచి వెర్సోవా వరకూ నేను రైల్లో వెళుతుండేదాన్ని. ఆ సమయంలో కారులో వెళ్లేందుకు అవసరమైనంత డబ్బు మా కుటుంబం వద్ద లేదు. రైల్లో నన్ను కొరకొరా చూసేవాళ్లు. ఒక్కోసారి ఆ చూపులు భరించలేనివిగా ఉండేవని ఆమె గుర్తుచేశారు.

ఈ భూమిపై ప్రతి మహిళ ముఖ్యంగా ఇండియాలోని ప్రతి స్త్రీకి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ అవాంఛిత తాకుళ్ల అనుభవాన్ని ఎదుర్కొన్నవారే. వాటిని చెప్పుకోలేక ఎంతో బాధపడిన వారే"నని పూనమ్ మహజన్ అభిప్రాయపడ్డారు.

. మహిళలు మరింత ధృడంగా మారాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఇంతవరకూ ఓ మహిళ అధ్యక్షురాలు కాలేదని, ఇండియాలో ఆ ఘనతను మహిళకు దగ్గర చేశామని చెప్పుకొచ్చారు.

అత్యంత కీలకమైన రక్షణ శాఖతో పాటు, ఎన్నో రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ సంప్రదాయం మరింతగా విస్తరించాల్సి వుందని పూనమ్ అభిప్రాయపడ్డారు.

ఎవరైనా వేధించాడని భావిస్తే, అతను ఏం చేశాడన్న విషయాన్ని పక్కనబెట్టి, చెంపలు వాయించాలని పిలుపునిచ్చారు. టీవీ చానళ్లలో ప్రసారమవుతున్న హిందీ సీరియల్స్ భారత మహిళలపై ఉన్న గౌరవభావాన్ని చెడగొడుతున్నాయని ఆరోపించారు.

English summary
BJP MP from Mumbai North, Poonam Mahajan, said on Sunday that every Indian woman, including herself, has faced "sexual trouble" or harassment at some stage.Speaking at The Red Brick Summit at the Indian Institute of Management-Ahmedabad (IIM-A), Mahajan said that self-pity should not be the response to such experiences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X