వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్ పి తరపున ప్రచారం చేస్తానన్న లాలూ, అభ్యర్థుల జాబితాలో శివపాల్ కు దక్కనిచోటు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరపున తాను ప్రచారం చేస్తానని ఆర్ జె డి చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ప్రకటించారు.బీహర్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ కూడ ఈ ప్రచారంలో పాల్గొంటారని ఆయన చెప్ప

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్టు ఆర్ జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ తరపున తనతో పాటు బీహర్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడ ప్రచారంలో పాల్గొంటారని ఆయన ప్రకటించారు.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీపార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన లాలూ ప్రకటించారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించాడు.

సమాజ్ వాదీ పార్టీ లో నెలకొన్న సంక్షోభాన్ని సమసిపోయేలా చేసేందుకుగాను లాలూ చొరవ చూపాడు. అయితే అఖిలేష్ మాత్రం లాలూ యాదవ్ చొరవను సున్నితంగానే తిరస్కరించాడు.

యూపిలో బిజెపి అధికారంలోకి రాకూడదనే ఉద్దేశ్యంతోనే లాలూ సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం మేరకు యూపి ఎన్నికల్లో ప్రచారానికి తాను కూడ సిద్దమయ్యారు.

 యూపి ఎన్నికల్లో అఖిలేష్ కు బాసటగా లాలూ

యూపి ఎన్నికల్లో అఖిలేష్ కు బాసటగా లాలూ

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు బాసటగా ఆర్ జెడి నిలవ నుంది. ఈ మేరకు ఆర్ జెడి చీఫ్ లాలూ ప్రకటన చేశాడు. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ తరపున ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. యూపిలో మరోసారి అఖిలేష్ సిఎంగా విజయం సాధించేందుకుగాను తాను ప్రచారం చేస్తానని ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తుపెట్టుకోవడాన్ని కూడ ఆయన సమర్థించారు.తనతో పాటు బీహర్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తారని ఆయన చెప్పారు.

 అఖిలేష్ ను ములాయం ఆశీర్వదించాలి

అఖిలేష్ ను ములాయం ఆశీర్వదించాలి

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు అవసరమైన వ్యూహన్ని అనుసరించాలని లాలూ ప్రతిపాదిస్తున్నాడు. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా సమాజ్ వాదీ పార్టీ వ్యవహరించాలని కోరుతున్నాడు.సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ ను ఆశీర్వదించాలని లాలూ సూచించారు. తండ్రి కొడుకులు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 అభ్యర్థుల జాబితాలో శివపాల్ పేరు లేదు

అభ్యర్థుల జాబితాలో శివపాల్ పేరు లేదు

సమాజ్ వాదీ పార్టీలో తండ్రి కొడుకుల మద్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎన్నికల కమీషన్ ప్రకటనతో అఖిలేష్ యాదవ్ ది పై చేయిగా నిలిచింది. ఎన్నికల కమీషన్ ప్రకటన తర్వాత అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఆయన తన తండ్రి ఆశీర్వాదం తీసుకొన్నారు.ఈ సమయంలోనే ములాయం సింగ్ 38 మంది అభ్యర్థుల జాబితాను అఖిలేష్ కు ఇచ్చారని సమాచారం. అయితే ఈ జాబితాలో తన సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ పేరును చేర్చలేదని తెలుస్తోంది.

 శివపాల్ కు బదులుగా ఆయన కొడుకు పేరు

శివపాల్ కు బదులుగా ఆయన కొడుకు పేరు

ములాయం సింగ్ యాదవ్ తాను అఖిలేష్ యాదవ్ కు ఇచ్చిన జాబితాలో శివపాల్ యాదవ్ పేరు చేర్చలేదు.అయితే శివపాల్ యాదవ్ తనయుడు ఆదిత్య యాదవ్ పేరును చేర్చారు.మరో వైపు సమాజ్ వాదీ పార్టీలో ముసలానికి కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణయాదవ్ పేరును కూడ ములాయం ఈ జాబితాలో చేర్చారు.ఈ జాబితాలో ఓం ప్రకాష్ సింగ్, నారద్ రాయ్, షదాబ్ ఫాతిమా , గాయత్రి ప్రసాద్ ,ప్రజాపతిలకు ములాయం సింగ్ యాదవ్ తన జాబితాలో చోటు కల్పించారు.

 ములాయం సింగ్ మెత్తబడ్డారా

ములాయం సింగ్ మెత్తబడ్డారా

అఖిలేష్ యాదవ్ పై తానే పోటీచేస్తానని ప్రకటించిన ములాయం సింగ్ యాదవ్ కొంత మెత్తబడ్డట్టుగా కన్పిస్తున్నారు. అఖిలేష్ వచ్చి తన ఆశీర్వాదాలు తీసుకొన్న మీదట ములాయం సింగ్ కొంత మెత్తబడ్డట్టుగా కన్పిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతామని అఖిలేష్ చెబుతున్నారు. తమ బంధుత్వం ఎన్నడూ విడదీయరానిదని అఖిలేష్ చెప్పారు.

English summary
i will campign for samajwadi party in uttrarpradesh elections rjd chief lalu prasad yadav.bihar deputy cm tejaswi prasad also participate in campign he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X