• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘నాకిదే బాగుంది.. బిచ్చమెత్తుకుంటా..’, శివుడే చెప్పాడంటూ.., సెల్ఫీ కోసం జనం!

By Ramesh Babu
|

చెన్నై: 'కొత్త బిచ్చగాడు పొద్దెరగడు..' అనే రీతిలో ఉంది రష్యన్ పౌరుడు ఈవ్‌జెనీ బేర్డినీకోవ్‌ తీరు. సాయం చేస్తామన్నా ససేమిరా అంటున్నాడు. తనకు బిచ్చమెత్తుకోవడమే బాగుందని, శివుడే తనను బిచ్చమెత్తుకోమన్నాడని చెబుతున్నాడు.. ఇంకేం చేస్తాం!

ఏటీఎం కార్డ్ పిన్ లాక్, గుడి ముందు బిచ్చమెత్తుకున్న రష్యా యువకుడు, స్పందించిన సుష్మా

రష్యా దేశానికి చెందిన బేర్డినీకోవ్‌ ఈనెల 9వ తేదీన మనదేశంలోని కాంచీపురం పర్యాటనకు వచ్చి అక్కడ బిచ్చమెత్తుకోవడం తెలిసిందే. రోజువారీ ఖర్చుల కోసం అతడు బిచ్చగాడి అవతారమెత్తడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అతడి వ్యవహారం ఆనోటా, ఈనోటా పడి చివరికి పత్రికలు, టీవీ ఛానళ్ల వరకు వెళ్లడంతో పాపం.. ఈవ్‌జెనీ బేర్డీనీకోవ్ అవస్థలు దేశమంతా తెలిశాయి. కొందరు 'అయ్యోపాపం' అన్నారు. మరికొందరు అతడికి డబ్బు సహాయం చేశారు.

రష్యా నుంచి వచ్చి...

రష్యా నుంచి వచ్చి...

రష్యా దేశానికి చెందిన 24 ఏళ్ల ఈవ్‌జెనీ బేర్టినీ కోవ్‌ భారత దేశంలోని ఆలయాలను చూడడానికి కాంచీపురం పర్యాటనకు వచ్చాడు. ఈనెల 9వ తేదీన రాత్రి 8.15 గంటలకు రైలులో కాంచీపురం చేరుకున్నాడు. ఖర్చుల కోసం తెచ్చుకున్న రూ.4 వేలు అయిపోవడంతో డబ్బు డ్రా చేసేందుకు సమీపంలోని ఏటీఎం వద్దకు వెళ్లాడు. ఏటీఏం పిన్ తప్పుగా ఎంటర్ చేయడంతో డబ్బు రాలేదు సరికదా, అతడి కార్డు కూడా లాక్ అయిపోయింది. దీంతో విరక్తి చెందిన అతను ఎటీఎం కార్డును విరగొట్టేశాడు. డబ్బు కోసం ఏం చేయాలో తెలియక రాత్రంతా కాంచీపురంలోని వీధుల వెంట తిరిగాడు. రోజువారీ ఖర్చులకు మరో మార్గం లేకపోవడంతో మర్నాడు ఉదయం కాంచీపురంలోని కుమరకొట్టం ఆలయం ఎదుట ఉన్న మెట్ల వద్ద తన టోపీని జోలెగా పడుతూ బిచ్చమెత్తుతూ కూర్చున్నాడు.

 పాపం ఎలా బతికినోడో.. ఇలా...

పాపం ఎలా బతికినోడో.. ఇలా...

ఆలయం వద్దనున్న బిచ్చగాళ్లు తమ వరుసలో ఎర్రగా బుర్రగా ఉన్న రష్యా బిచ్చగాడు బేర్డీనీకోవ్ ని చూసి ఆశ్చర్యపోయారు. అతడు మన దేశస్థుడు కాడని తెలుసుకుని ఎంతో మర్యాదగా వ్యవహరించసాగారు. ఆలయానికి వచ్చిన భక్తులు సైతం అతడి విషయం తెలుసుకుని ‘అయ్యో పాపం' అంటూ దండిగానే డబ్బులు వేయడం ప్రారంభించారు. అలా బిచ్చమెత్తుకుంటూ వచ్చిన డబ్బుతో బేర్డీనీకోవ్ తన రోజువారీ అవసరాలు తీర్చుకోసాగాడు.

సాయం చేస్తానన్న విదేశాంగ మంత్రి...

సాయం చేస్తానన్న విదేశాంగ మంత్రి...

చివరికి ఈ విషయాన్ని కొంతమంది ట్విట్టర్ ద్వారా విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆపన్నులకు సాయం అందించడంలో ముందువరుసలో ఉండే ఆమె స్పందించి అతడికి సాయం చేస్తానంటూ ట్విట్టర్ ద్వారా హామీ ఇచ్చారు. ‘ఈవ్‌ జెనీ.. మీ రష్యా మాకు మిత్రదేశం, చెన్నైలోని విదేశాంగశాఖ అధికారులు నీకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నారు..' అంటూ తన ట్విటర్‌ ద్వారా ఈనెల 11వ తేదీన సందేశం పంపారు. అయితే సుష్మాస్వరాజ్‌ సహకారంపై రష్యా యువకుడు స్పందించిన దాఖలాలు లేవు. ఈలోగా సుష్మా ఆదేశం మేరకు అధికారులు ఈవ్‌జెనీ బేర్డినీకోవ్‌ పరిస్థితిని చెన్నైలో ఉన్న రష్యా రాయబార కార్యాలయం దృష్టికి కూడా తీసుకెళ్లారు.

 కాంచీపురం నుంచి చెన్నైకి...

కాంచీపురం నుంచి చెన్నైకి...

మరోవైపు రష్యా యువకుడు ఈవ్‌జెనీ బేర్డినీకోవ్ వ్యవహారం తెలియగానే కాంచీపురంలోని పోలీసులు కూడా స్పందించారు. విషయం తెలుసుకున్న శివకంచి పోలీసులు అతడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, చెన్నైలో రష్యా రాయబార కార్యాలయానికి కబురంపారు. గత మంగళవారం రైలులో చెన్నైకు తీసుకు వచ్చి దౌత్య కార్యాలయ అధికారులకు అతడిని అప్పగించారు. అలా శివకంచి పోలీసుల సహకారంతో చెన్నైకి చేరుకున్న బేర్డీనీకోవ్ రష్యన్ రాయబార కార్యాలయం నుంచి మళ్లీ బయటికొచ్చేశాడు. టీ నగర్‌ పరిసరాల్లో తిరిగి, అక్కడి వేంకటేశ్వర ఆలయంలో స్వామి వారిని కూడా దర్శించుకుని మళ్లీ పాతపాటే మొదలెట్టాడు. ఆలయం మెట్ల వద్ద కూర్చుని బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు.

 దిక్కుతోచకే ఆ పని చేశా...

దిక్కుతోచకే ఆ పని చేశా...

చెన్నై నార్త్‌ ఉస్మాన్‌రోడ్డులోని మరో ఆలయం వద్ద ఆదివారం బిచ్చమెత్తుకుంటూ కనిపించిన ఈవ్‌జెనీ బేర్డినీకోవ్ ను చూసి స్థానికులు పలకరించారు. ఈ సందర్భంగా వారితో అతను మాట్లాడుతూ, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య సైనికపోరు కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఈ కారణంగా తాను పర్యాటక వీసాపై భారత్‌కు చేరుకున్నట్లు తెలిపాడు. భారత్‌కు వచ్చిన సమయంలో తన వద్ద కేవలం రూ.4 వేలు మాత్రమే ఉన్నాయని, ఈ డబ్బు కూడా ఖర్చయిపోవడంతో దిక్కుతోచక కాంచీపురంలో బిచ్చమెత్తినట్లు తెలిపాడు. ఈ విషయం పత్రికల్లో రావడంతో కొందరు డబ్బు సహాయం చేశారని చెప్పాడు.

 ఇలా భారత్ లోని ఆలయాలన్నీ తిరుగుతా...

ఇలా భారత్ లోని ఆలయాలన్నీ తిరుగుతా...

మరి రష్యాకు తిరిగి ఎప్పుడెళతావు అని స్థానికులు ప్రశ్నించగా, తాను రష్యా వెళ్లనని, భారత్ లోనే ఉంటూ దేశంలోని అన్ని ఆలయాలు తిరుగుతూ బిచ్చమెత్తుకుంటానని బేర్డినీకోవ్ తెలిపాడు. తాను శివభక్తుడినని, శివుడే తనకు బిచ్చమెత్తుకోమని ఆదేశించాడంటూ అతడు చెప్పడంతో వింటున్న వారు కూడా విస్తుపోయారు. విచిత్రం ఏమిటంటే.. ఇప్పుడు అతడి వద్ద డబ్బులు కూడా దండిగానే ఉన్నాయని, తనతో సెల్ఫీ దిగిన వారికి రూ.10 రేటు పెట్టానని, డబ్బు చెల్లించి మరీ సెల్ఫీ దిగుతున్నారంటూ అతడు ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై రష్యా రాయబార కార్యాలయంలో వివరణ కోరగా, నిబంధనల ప్రకారం ఎవరైనా సాయం కోరినప్పుడే తాము స్పందించాలని, ఇవాంజెలిన్ బేర్డినీకోవ్ నుంచి తమకు ఎలాంటి అభ్యర్దన రాలేదని తెలిపారు. మరోవైపు బేర్డినీకోవ్ భారత్‌ వీసా కూడా నవంబరు 22వ తేదీతో ముగియనుంది. మరి ఆ తరువాతైనా అతడ్ని రష్యా పంపిస్తారేమో వేచి చూడాల్సిందే!

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Russian tourist, Evgenii Berdnikov, ‘rescued’ by the police and sent to Chennai after he sought alms at a Kancheepuram temple on Tuesday says he would continue begging and has no immediate plans to leave the country. DC found the man with another tourist on South Boag road in T Nagar. It seemed that the foreign national is not in any distress as feared initially. Russian consulate in Chennai had earlier told the media that he had not contacted them and that they will assist him in a proper way if he contacts them. When asked as to why he has not contacted the Russian consulate in Chennai as suggested by the cops, Evgenii replied that they would be of no help to him and he wants to travel. His visa expires on November 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more