చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాడు ప్రజలు నన్ను సీఎం చేస్తారు, కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా: కమల్ హాసన్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: భారత సినీరంగంలో తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బహుబాష నటుడు కమల్ హాసన్ తాను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని దృవీకరించారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కమల్ హాసన్, కేజ్రీవాల్ మీటింగ్: ట్రంప్ తో భేటీ అయినా మాకు నష్టం లేదు: మంత్రి, తిరగలేవు!కమల్ హాసన్, కేజ్రీవాల్ మీటింగ్: ట్రంప్ తో భేటీ అయినా మాకు నష్టం లేదు: మంత్రి, తిరగలేవు!

తమిళనాడు ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చూడాలని ఎదురు చూస్తున్నారని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రస్తుతం చీకటి, రిసార్ట్ రాజకీయాలు జరుగుతున్నాయని, వాటిని చూసి తమిళ ప్రజలు విరక్తి పెంచుకున్నారని చెప్పారు.

I will go alone Tamil Nadu politics says Kamal Haasan

తాను వ్యాపారం చెయ్యడానికి రాజకీయాల్లోకి రావడంలేదని, ప్రజలకు సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి వస్తున్నానని కమల్ హాసన్ వివరించారు. ప్రస్తుతం తమిళనాడులో కుళ్లు రాజకీయాలు, రిసార్ట్ రాజకీయాలు జరుగుతున్నాయని, ప్రజల కష్టాల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కమల్ హాసన్ ఆరోపించారు.

కమల్ హాసన్, కేజ్రీవాల్ భేటీ: మీడియాకు అసలు విషయం చెప్పిన హీరో, సీఎం, అభిమాని!కమల్ హాసన్, కేజ్రీవాల్ భేటీ: మీడియాకు అసలు విషయం చెప్పిన హీరో, సీఎం, అభిమాని!

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం చెన్నై చేరుకుని కమల్ హాసన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయిన తరువాత కమల్ హాసన్ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో సంచనల వ్యాఖ్యలు చేశారు.

తనను తమిళనాడు ప్రజలు కచ్చితంగా ముఖ్యమంత్రిని చేస్తారని కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లో రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని కమల్ హాసన్ మరో సారి చెప్పారు. కమల్ హాసన్ ఆప్ లో చేరుతారా ? లేక సొంత పార్టీ పెడుతారా ? అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

English summary
In an exclusive interview with India Today, Tamil superstar Kamal Haasan confirmed his entry into politics after months of political deliberations and insinuations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X