వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో త్రీడేస్ సీఎంలు, పవార్ దెబ్బకు దేవేంద్రుడు ఫినిష్, సిక్స్ కొడతాడంటే డక్కౌట్ !

|
Google Oneindia TeluguNews

ముంబై/బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు మహారాష్ట్రలో రిపీట్ అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో గత ఏడాది కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొక ముందే సీఎం పదవికి బీఎస్. యడియూరప్ప రాజీనామా చేశారు. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బుధవారం (రేపు) సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాల్సిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన పదవికి రాజీనామా చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మూడు రోజుల్లోనే కర్ణాటకలో బీఎస్. యడియూరప్ప, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ వారి పదవులుకు రాజీనామా చేశారు. కర్ణాటక రాజకీయాలు మహారాష్ట్రలో రిపీట్ కావడంతో బీజేపీ నాయకులు కోలుకోలేని దెబ్బ పడింది. పవార్ దెబ్బకు దేవేంద్రుడు ఫినిష్ అయ్యారు. మహారాష్ట్రలో బీజేపీ సిక్స్ కొడుతుంది అనుకుంటే డక్కౌట్ అయ్యింది.

మూడు చక్రాల కుర్చీ సర్కార్.. ఎన్నాళ్లుంటుందో..అంతా ఆయనే చేశారు: ఫడ్నవీస్మూడు చక్రాల కుర్చీ సర్కార్.. ఎన్నాళ్లుంటుందో..అంతా ఆయనే చేశారు: ఫడ్నవీస్

 పరుగో పరుగు

పరుగో పరుగు

గత ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని ఆ రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా అహ్వానించారు. మంచి చాన్స్ వచ్చిందని బీఎస్ యడియూరప్ప పరుగో పరుగు అంటూ 2018 మే 17వ తేదీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

 సుప్రీం కోర్టు షాక్

సుప్రీం కోర్టు షాక్

అసెంబ్లీలో బలపరీక్ష నిరూపణకు యడియూరప్ప గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించి వెంటనే బలపరీక్ష నిరూపించుకోవాలని యడియూరప్పకు ఆదేశాలు జారీ చెయ్యాలని మనవి చేశాయి. అయితే 2018 మే 19వ తేదీ బలపరీక్షకు కొన్ని గంటల ముందే యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు.

 దేవేంద్రుడికి అదే పరిస్థితి వచ్చింది

దేవేంద్రుడికి అదే పరిస్థితి వచ్చింది

బుధవారం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో బలపరీక్షలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నిరూపించుకోవాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మంగళవారం మద్యాహ్నం ఎన్సీపీ సీనియర్ నేత, బీజేపీకి మద్దతు ఇచ్చిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అజిత్ పవార్ రాజీనామా చేసి రెండు గంటల వ్యవదిలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

పవార్ రాజకీయాలకు ఫినిష్

పవార్ రాజకీయాలకు ఫినిష్

శరద్ పవార్ ఆడిన రాజకీయ చదంరంగంలో బీజేపీ విలవిలలాడిపోయింది. అజిత్ పవార్ ను సొంతగూటికి లాక్కోవడానికి శరద్ పవార్ తో పాటు ఎన్సీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో బీజేపీ షాక్ కు గురైయ్యింది. శరద్ పవార్ దెబ్బకు బీజేపీ నాయకులకు కోలుకోలేని దెబ్బ పడింది. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

త్రీడేస్ సీఎంలు

త్రీడేస్ సీఎంలు

కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే ఆయన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ సైతం మూడు రోజులకే ఆయన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక బీఎస్ యడియూరప్ప, మహారాష్ట్రల్లో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవులు మూడునాళ్ల ముచ్చట్లగా మిగిలిపోయాయి. కర్ణాటకలో బీఎస్. యడియూరప్ప, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ త్రీడేస్ సీఎంలుగా పేరు తెచ్చుకున్నారు.

English summary
New Delhi: Maharashtra Political Crisis: Devendra Fadnavis says BJP got a clear mandate in Assembly polls. I will meet Governor and resign from CM post : Fadnavis. What was SC ruling when same situation arise in Karnataka in2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X