వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ మాకంటే మంచి పాలన అందిస్తుందనే, ట్యూబ్‌లెస్: అఖిలేష్ షాకింగ్

తమ కంటే వచ్చే (బీజేపీ) ప్రభుత్వం మరింత మంచి పాలన అందిస్తుందని భావిస్తున్నానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శనివారం అన్నారు. బీజేపీ చేతిలో ఘోర పరాజయం ఓటమి అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: తమ కంటే వచ్చే (బీజేపీ) ప్రభుత్వం మరింత మంచి పాలన అందిస్తుందని భావిస్తున్నానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శనివారం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బీజేపీ చేతిలో ఘోర పరాజయం ఓటమి అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

బీజేపీ ప్రభుత్వం మాకంటే బాగా పని చేస్తుందని..

ఎన్నికల్లో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. కొత్త ప్రభుత్వం తమ కంటే బాగా పని చేస్తుందని తాను భావిస్తున్నానని అఖిలేష్ అన్నారు. మరి మాకంటే మంచి పాలన అందిస్తుందో లేదో చూడాలన్నారు.

<strong>సోనియా-రాహుల్‌లకూ షాకిచ్చాం!, మాయవతిపై నో: అమిత్ షా</strong>సోనియా-రాహుల్‌లకూ షాకిచ్చాం!, మాయవతిపై నో: అమిత్ షా

I will take responsibility about the defeat only after deliberating on it: AKhilesh

కాంగ్రెస్‌తో బంధం కొనసాగుతుంది

ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని అఖిలేష్ చెప్పారు. తొలి కేబినెట్ సమావేశంలోనే రైతు రుణమాఫీ చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో తమ బంధం కొనసాగుతుందని తెలిపారు. మా హయాంలో యూపీలో మంచి పాలననే అందించామని చెప్పారు.

మాయావతి ఆరోపణలపై ఆలోచన చేయాలి

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపణలపై కేంద్రం, ఎన్నికల సంఘం ఆలోచన చేయాలని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీఎస్పీ ఆరోపణలపై తాను ఇప్పుడే మాట్లాడనని, విచారణ జరిపించాక మాట్లాడుతానన్నారు.

<strong>డింపుల్ యాదవ్ వచ్చినా.. సీఎం కావాలనుకున్న అపర్ణకు షాక్</strong>డింపుల్ యాదవ్ వచ్చినా.. సీఎం కావాలనుకున్న అపర్ణకు షాక్

మాది ట్యూబ్ లెస్ టైర్

తమది ట్యూబ్ లెస్ సైకిల్ అని, కాబట్టి తమ సైకిల్‌కు గాలి పోవడం అన్నది జరగనే జరగదని చెప్పారు. తమ ప్రభుత్వం మంచి పాలనే అందించిందని, ప్రజలు ఇంతకంటే మంచి పాలన కోరుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును స్వీకరించడమే గౌరవప్రదం అన్నారు.

English summary
“Our cycle was a tubeless cycle. In politics, you can never say what happens... until someone does work better than us, our work will speak,” says Akhilesh Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X