బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదుపు త‌ప్పి..ర‌న్‌వేను దాటుకుని! విమానాశ్ర‌యంలో ప్ర‌మాదం

|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో బుధ‌వారం ఉద‌యం ప్ర‌మాదం చోటు చేసుకుంది. భార‌త వైమానిక ద‌ళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ప్ర‌మాదానికి గురైంది. టేకాఫ్‌ స‌మ‌యంలో విమానం అదుపు త‌ప్పింది. ర‌న్‌వేపై జారిపోయింది. గతుకుల రోడ్డు మీదికి వ‌చ్చి ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని ప్రాథ‌మికంగా అందిన స‌మాచారం. ఈ విష‌యాన్ని ముంబై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌య సంస్థ ధృవీక‌రించింది. వైమానిక ద‌ళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ప్ర‌మాదానికి గురైంద‌ని అంటూ అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ముంబై విమానాశ్ర‌యంలో విమానాల రాకపోక‌ల‌కు స్వ‌ల్పంగా ఆటంకం ఏర్ప‌డింది.

ముంబై నుంచి బెంగ‌ళూరుకు..

ముంబై నుంచి మంగ‌ళ‌వారం రాత్రి బెంగ‌ళూరుకు బ‌య‌లుదేరింది ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌. బెంగ‌ళూరులోని య‌ల‌హంక ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌కు చేరుకోవాల్సి ఉంది. ర‌న్‌వేపై టేకాఫ్ తీసుకుంటున్న స‌మ‌యంలో ప్ర‌మాదానికి గురైంది. 11:39 నిమిషాల‌కు ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు అధికారులు నిర్ధారించారు. టేకాఫ్ స‌మ‌యంలో అదుపు త‌ప్పింది. ఊహించిన దానికంటే వేగంగా ఉండ‌టం వ‌ల్ల పైలెట్ దాన్ని నియంత్రించ‌లేక‌పోయారు. ర‌న్‌వేపై జారుకుంటూ వెళ్లిపోయింది. గతుకుల రోడ్డు మీద కొంత‌దూరం ప్ర‌యాణించి- నిలిచిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింద‌ని అధికారులు తెలిపారు.

IAF Aircraft Overshoots Main Runway In Mumbai, Many Flights Delayed

ఈ ఘ‌ట‌న వ‌ల్ల ర‌న్‌వే కొంత‌భాగం ధ్వంస‌మైంది. దీనితో విమానాల రాక‌పోక‌ల‌కు స్వ‌ల్ప అంత‌రాయం ఏర్ప‌డింది. రెండో ర‌న్‌వేను అందుబాటులోకి తీసుకొచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే విమానాశ్ర‌యం సిబ్బంది విమానాన్ని య‌ధాస్థితికి తీసుకుని రావ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

English summary
MUMBAI: An Indian Air Force (IAF) aircraft overshot the main runway while departing from the Mumbai airport on Tuesday night. The air force aircraft AN-32 was departing for Yelahanka Air Force Station near Bengaluru in Karnataka. However, no injuries have been reported. An official of the Mumbai International Airport Limited (MIAL) said today that due to this incident, aircraft movement was diverted to the secondary runway. "We confirm that an Air Force aircraft departing from the Mumbai airport had runway excursion at 11.39 pm on Tuesday," the official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X