వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన క్షిపణి ఢీకొట్టడంతోనే బుద్గామ్‌లో చాపర్ కూలింది: ఐఏఎఫ్ చీఫ్

|
Google Oneindia TeluguNews

ఫిబ్రవరి 27న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారీ తప్పిదం చేసిందని ఐఏఎఫ్ చీఫ్ రాకేష్ కుమార్ భదౌరియా అన్నారు. బుద్గాంలో ఎమ్ఐ-17 చాపర్‌ ఆరోజు కూలిన సంగతి తెలిసిందే. అప్పటికే భారత్ పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక చాపర్ కూలిపోవడంతో ఆరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ ఉద్యోగులు మృతి చెందారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి విచారణ ముగిసందని చెప్పిన ఎయిర్‌ఫోర్స్ చీఫ్... మన క్షిపణి మన సొంత చాపర్‌ను కూల్చిందని చెప్పారు. ఇందుకు కారణమైన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆర్‌కే భదౌరియా తెలిపారు.

బుద్గాంలో ఎమ్ఐ-17 చాపర్ కూలింది. అప్పటికే భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. అయితే ఈ చాపర్‌ను పాక్ కూల్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. అంతే స్థాయిలో పాకిస్తాన్ కూడా తామే కూల్చినట్లుగా ప్రచారం చేసుకుంది. కానీ అసలు నిజం విచారణలో తేలింది. భారత్‌కు చెందిన క్షిపణే ఈ చాపర్‌ను పొరపాటున కూల్చినట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ తెలిపారు.అంతకుముందు విచారణలో ఐదు మంది అధికారుల తప్పిదం వల్లనే చాపర్ కూలిపోయిందని చెప్పారు.

IAF chief admits that our missile had hit MI-17 chopper in Budgam on Feb 27th

ఫిబ్రవరి 26న భారత్ బాలాకోట్‌ పై మెరుపుదాడులు చేసిన తర్వాత ఫిబ్రవరి 27న భారత్ పాకిస్తాన్‌ల యుద్ద విమానాలు కాసేపు గాల్లో చిన్న పాటి యుద్ధాన్నే చేశాయి. బాలాకోట్‌లో భారత వాయుసేన ఉగ్రశిబిరాలపై మెరుపుదాడి చేసిన తర్వాత ప్రతీకారచర్యల్లో భాగంగా భారత్‌పై దాడి చేసేందుకు పాక్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. అయితే ఆ యుద్ధ విమానాలను భారత్ విజయవంతంగా తరిమికొట్టింది.

ఫిబ్రవరి 26న జరిగిన దాడుల పరిణామంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫిబ్రవరి 27న చాలా అలర్ట్‌గా ఉంది. ఈ క్రమంలోనే క్షిపణి ఎమ్ఐ 17ను కూల్చింది. ఇందులో ఆరుగురు మృతి చెందారు. ఎమ్ఐ 17 వీ-5 చాపర్ గాల్లోకి టేకాఫ్ తీసుకున్న 10 నిమిషాలకే క్షిపణి ఢీకొట్టడంతో కుప్పకూలింది. ఆ సమయంలో భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్‌తో డాగ్ ఫైట్‌కు దిగాయి. ఇక్కడే వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫైటర్ జెట్ కూలడంతో ఆయన సురక్షితంగా బయట పడి పాకిస్తాన్ భూభాగంలోకి పడిపోయాడు. దీంతో ఆయన్ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది.

English summary
The Budgam air crash on February 27 that left 6 IAF personnel, was a big mistake on part of the air force, admitted IAF chief RKS Bhadauria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X