వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిషన్ గగన్‌యాన్: పైలెట్ల ఎంపిక ప్రక్రియ మొదటి దశ పూర్తి, వైద్య పరీక్షలు, ఇక రష్యాకే..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గగన్‌యాన్ కోసం వ్యామగాము(ఆస్ట్రోనాట్స్)ల ఎంపిక ప్రక్రియలో మొదటి దశ పూర్తయింది. బెంగళూరులోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్‌ఏరోస్పేస్ మెడిసిన్‌లో ఆస్ట్రోనాట్‌ల కోసం మొదటి దశ ఎంపిక పరీక్షలు కొనసాగినట్లు భారతీయ వాయుసేన(ఐఏఎఫ్) వెల్లడించింది.

గగన్ యాన్ కోసం భారత వాయుసేన పైలెట్లను ఇస్రో ఎంపిక చేయగా.. ఆ పైలట్లకు శారీరక పరీక్షలు నిర్వహించినట్లు ఐఏఎఫ్ తెలిపింది. మొదటిసారి మనుషులను అంతరిక్షంలోకి పంపుతుండటంతో శిక్షణ అనుభవం ఉన్న పైలెట్లే సరైనవారని ఇస్రో భావించింది.

 IAF completes first level of selecting astronauts for Gaganyaan mission from its test pilots pool

ఈ క్రమంలో ఎంపిక చేసిన పైలెట్లకు ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. రేడియాలాజికల్, క్లినికల్ పరీక్షలు చేశారు. ఎంపిక ప్రక్రియలో కాబోయే వ్యోమగాముల సైకాలజీని కూడా పరీక్షించారు.

మానవులను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో భారత్ 2022లో గగన్‌యాన్ ప్రాజెక్టును చేపడుతోంది. అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపారు.+

ఇండియన్ ఏయిరో స్పేస్ మెడిసిన్(ఐఏఎం)లో పైలెట్లకు కఠినమైన శారీరక పరీక్షలు జరిపామని ఐఏఎఫ్ తెలిపింది. మొదటగా 12మందిని ఎంపిక చేసి.. ఆ తర్వాత వారిలో నలుగురిని తుది శిక్షణ కోసం నవంబర్ తర్వాత రష్యాకు పంపనున్నారు. ఆ నలుగురిలో ముగ్గురు మాత్రం గగన్ యాన్ మిషన్ ద్వారా నింగిలోకి ఎగరనున్నారు.

English summary
IAF completes first level of selecting astronauts for Gaganyaan mission from its test pilots pool
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X